Viral news: పాముతో ప్రమాదకర ఆటలు.. మీదకు వస్తున్న పామును స్నేహితుడి పైకి విసిరిన యువకుడు.. చివరకు..

ABN , First Publish Date - 2023-07-05T16:51:44+05:30 IST

కొందరు యువకుల ఆకతాయిల చేష్టలు.. కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందికరంగా మారుతుంటాయి. ఇటీవల కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వీడియోలలో కొన్ని అందరికీ నవ్వు తెప్పిస్తుంటే.. మరికొన్ని..

Viral news: పాముతో ప్రమాదకర ఆటలు.. మీదకు వస్తున్న పామును స్నేహితుడి పైకి విసిరిన యువకుడు.. చివరకు..

కొందరు యువకుల ఆకతాయిల చేష్టలు.. కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందికరంగా మారుతుంటాయి. ఇటీవల కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వీడియోలలో కొన్ని అందరికీ నవ్వు తెప్పిస్తుంటే.. మరికొన్ని ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పాముతో ఆటాడుకుంటూ.. చివరకు దాన్ని స్నేహితుడి మీదకు విసిరేస్తాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో యువకుడి తుంటరి చేష్టలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral photos and video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు స్నేహితులు కాలువ వద్ద ఉండగా ఓ పాము (snake) అటుగా వెళ్తుంటుంది. వారిలో ఓ యువకుడు దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. చీపురుతో దాన్ని నేలకు గట్టిగా అదిమిపట్టాలని చూస్తాడు. అయినా పాము అతని నుంచి తప్పించుకుంటూ ముందుకు వెళ్తుంది. అంతటితో ఆగని యువకుడి పామును పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో పాము వేగంగా అతడి వైపు రావడంతో భయపడిపోయి.. దాన్ని చీపురుతో స్నేహితుడి వైపు విరిసికొడతాడు.

Whatsapp: వాట్సప్‌ వీడియోలో స్నేహితుడి కూతురిని అలా చూసి షాక్ అయిన వ్యక్తి.. విచారించగా చివరకు ఏం తెలిసిందంటే..

దీంతో పాము పక్కన ఉన్న వ్యక్తిపై పడుతుంది. ఒక్కసారిగా పాము మీద పడడంతో ఎక్కడ కాటేస్తుందో అనే కంగారుతో అతను అటూ, ఇటూ పరుగెడుతాడు. ఈ వీడియో అంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రాణాలతో చెలగాటం అందే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘వీడి పిచ్చి చేష్టలు స్నేహితుడి కొంపముంచాయి’’.. అని మరికొందరు, ‘‘పాములతో పరాచకాలు చాలా ప్రమాదకరం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కూతురిని రైలు ఎక్కించిన తండ్రి.. తొందరపాటులో చేసిన తప్పు వల్ల... చివరకు ఏమైందో చూడండి..

Updated Date - 2023-07-05T16:51:44+05:30 IST