Share News

Rachin Ravindra: ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్న రచిన్ రవీంద్ర.. ఆ జట్టుకే ఆడతాడా?

ABN , First Publish Date - 2023-11-11T15:07:21+05:30 IST

IPL 2024: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ ఆటగాడు, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలతో తన సత్తా చాటుకున్నాడు. దీంతో అతడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబరులో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రచిన్ రవీంద్ర కోసం భారీగా బిడ్డింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి.

Rachin Ravindra: ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్న రచిన్ రవీంద్ర.. ఆ జట్టుకే ఆడతాడా?

వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ ఆటగాడు, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలతో తన సత్తా చాటుకున్నాడు. దీంతో అతడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబరులో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రచిన్ రవీంద్ర కోసం భారీగా బిడ్డింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ కావడంతో అతడి కోసం పోటీ పడనున్నాయి. అయితే రచిన్ రవీంద్ర మాత్రం ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీపై మనసు పారేసుకున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లో తనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు. తనకు ఇష్టమైన టీమ్ ఆర్సీబీ అని.. ఆ జట్టులో తనకు చోటు దక్కితే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నట్లు రచిన్ తెలిపాడు. ఎందుకంటే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తాను ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో బెంగళూరులో ఆడినప్పుడు తనకు అక్కడి ప్రేక్షకులు మద్దతు తెలిపారని.. అక్కడి అభిమానులపై తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని వివరించాడు.

కాగా రచిన్ రవీంద్ర భారత సంతతి ఆటగాడు కావడం గమనించాల్సిన విషయం. అతడి తండ్రి రవి కృష్ణమూర్తి 1990 దశకంలోనే న్యూజిలాండ్ వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ తరఫున 2021లో కాన్పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టుతోనే అరంగేట్రం చేశాడు. అయితే మెగా టోర్నీలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న రచిన్ రవీంద్ర తనదైన శైలిలో ఆడుతున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. అనంతరం హిమాచల్‌ప్రదేశ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ రచిన్ రవీంద్ర శతకంతో మెరిశాడు. 89 బాల్స్‌లో 116 రన్స్ చేశాడు. అంతేకాకుండా బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌పైనా సెంచరీతో రాణించాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఐపీఎల్‌లో అతడి ఎంట్రీ దాదాపు ఖరారైపోయింది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లు రచిన్ రవీంద్రను వేలంలో కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. అతడు వేలంలోకి వస్తే కచ్చితంగా బిడ్డింగ్ వేస్తామని ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు వెల్లడించాయి.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-11T15:07:22+05:30 IST