Vishakapatnam T20: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!!
ABN , First Publish Date - 2023-11-23T18:49:53+05:30 IST
IND Vs AUS: విశాఖ వేదికగా తొలి 20 జరుగుతుండగా.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. విశాఖలో ఛేజింగ్ చేసిన టీమ్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉండగా.. సూర్యకుమార్ ఫీల్డింగ్ ఎంచుకోవడం అభిమానుల్లో సంతోషం నింపింది.
వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో తలపడబోతోంది. విశాఖ వేదికగా తొలి 20 జరుగుతుండగా.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. విశాఖలో ఛేజింగ్ చేసిన టీమ్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉండగా.. సూర్యకుమార్ ఫీల్డింగ్ ఎంచుకోవడం అభిమానుల్లో సంతోషం నింపింది. ఈ సిరీస్కు సీనియర్లు దూరంగా ఉండగా.. సూర్యకుమార్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. గతంలో అతడికి ముంబై ఇండియన్స్ తరఫున నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఇప్పటివరకు 17 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన సూర్యకుమార్ 11 మ్యాచ్లను గెలిపించగా ఆరు మ్యాచ్లలో మాత్రం ఓటమి చవిచూశాడు.
తుది జట్లు
టీమిండియా: సూర్యకుమార్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, యషస్వీ జైశ్వాల్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జాష్ ఇంగ్లీస్, అరోన్ హార్డిల్, మార్కస్ స్టాయినీస్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, నాథన్ ఎల్లీస్, జాసన్ బెరన్డార్ఫ్, తన్వీర్ సంఘా
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.