Share News

Virat Kohli Century: క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ నెలకొల్పిన కింగ్ విరాట్ కోహ్లీ

ABN , First Publish Date - 2023-11-15T17:51:50+05:30 IST

భీకరమైన ఫామ్‌లో ఉన్న ‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ కప్ 2023 తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై రికార్డ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో 50వ శతకాన్ని పూర్తి చేశాడు. 113 బంతుల్లో 117 పరుగులు కొట్టి ఔటయ్యాడు.

Virat Kohli Century: క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ నెలకొల్పిన కింగ్ విరాట్ కోహ్లీ

భీకరమైన ఫామ్‌లో ఉన్న ‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ కప్ 2023 తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై రికార్డ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో 50వ శతకాన్ని పూర్తి చేశాడు. 113 బంతుల్లో 117 పరుగులు కొట్టి ఔటయ్యాడు. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును చెరిపివేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడి అవతరించాడు. 292 మ్యాచ్‌ల్లో 50 సెంచరీలు పూర్తి చేశాడు.

కోహ్లీ రికార్డుతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ రెండవ స్థానంలో నిచాడు. రోహిత్ శర్మ(31), రికీ పాంటింగ్ (30), సనత్ జయసూర్య (28) వరుస స్థానాల్లో ఉన్నారు. కాగా సచిన్ టెండూల్కర్ చూస్తుండగానే కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టడం గమనార్హం. మైదానంలో ఉన్న సచిన్ నిలబడి మరీ చప్పట్లతో కోహ్లీని అభినందించాడు. ఇక కోహ్లీ కూడా సచిన్‌కి గౌరవంగా తలవంచి నమస్కరించాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది.

కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ రికార్డును కోహ్లీ చెరిపివేశాడు. 2003 వరల్డ్ కప్‌లో సచిన్ 673 పరుగులు కొట్టగా దానిని కోహ్లీ ఈ వరల్డ్ కప్‌లో అధిగమించాడు.

Updated Date - 2023-11-15T17:57:15+05:30 IST