VVS Laxman: బీసీసీఐ సంచలన నిర్ణయం: ద్రవిడ్ అవుట్.. కొత్త కోచ్ ఎవరంటే?
ABN , First Publish Date - 2023-01-02T20:48:31+05:30 IST
ప్రపంచంలోని టాప్ జట్లలో ఒకటైన టీమిండియా(Team India)కు 2022 ఏమాత్రం
ముంబై: ప్రపంచంలోని టాప్ జట్లలో ఒకటైన టీమిండియా(Team India)కు 2022 ఏమాత్రం కలిసిరాలేదు. వరుస పరాజయాలు వెక్కిరించాయి. ఐసీసీ ట్రోఫీల్లో పరాజయాలు జట్టు ప్రతిష్ఠను దిగజార్చాయి. జట్టుకు మరమ్మతులు చేయకుంటే ఈ ఏడాది కూడా అది కొనసాగే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ(BCCI) కొత్త సంవత్సరం రోజున (జనవరి 1న) ముంబైలోని ఓ సెవన్ స్టార్ హోటల్లో భారత జట్టు 2022 ప్రదర్శనపై సమీక్ష నిర్వహించింది. ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్(One Day World Cup)ను దృష్టిలో పెట్టుకుని రోడ్ మ్యాప్ రూపొందించింది. ఇందులో పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
రివ్యూ మీటింగులో తీసుకున్న సంచలనం నిర్ణయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది. జూనియర్ జట్టుకు కోచ్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)ను ఏరికోరి సీనియర్ జట్టుకు కోచ్‌గా ఎంపిక చేశారు. అయితే, జట్టుకు విజయాలు అందించడంలో ద్రవిడ్ విఫలమయ్యాడు. ముఖ్యమైన టోర్నీలలో జట్టు చతికిలపడింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదితో జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించకూడదని నిర్ణయించింది. అతడి స్థానంలో ద్రవిడ్ మాజీ టీమ్మేట్ వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman)ను తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో ఇప్పటికే పలు పర్యటనల్లో భారత జట్టుకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ కరోనా బారినపడడంతో ఆసియాకప్ 2022లో టీమిండియా కోచ్‌గా వ్యవహరించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లక్ష్మణ్ తొలిసారి భారత్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అప్పుడు రాహుల్ ద్రవిడ్.. ఇంగ్లండ్‌తో మిగిలిన ఏకైక టెస్టు(Rescheduled Test) మ్యాచ్ కోసం భారత సీనియర్ జట్టును సిద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి టీ20కి లక్ష్మణ్ ఇన్చార్జ్ కోచ్‌గా వ్యవహరించాడు. జింబాబ్వే(Zimbabwe)లో జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు లక్ష్మణ్ తొలిసారి పూర్తిస్థాయిలో కోచ్‌గా వ్యవహరించాడు. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా ఉన్నాడు.