IND vs WI 3rd T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. రెండు కీలక మార్పులతో బరిలోకి టీమిండియా!..
ABN , First Publish Date - 2023-08-08T19:50:14+05:30 IST
కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జేసన్ హోల్డర్ స్థానంలో చేజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది.
గయానా: కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జేసన్ హోల్డర్ స్థానంలో రోస్టన్ చేజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్‌కు దూరమైన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. దీంతో రవి బిష్ణోయ్ బెంచ్‌కు పరిమితయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌తో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత జట్టు 0-2తో వెనుకబడింది. దీంతో ఈ మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డైగా మారింది. టీమిండియా సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు అతిథ్య వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 150 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. కాగా ఇప్పటివరకు చాహల్ 72 వన్డేలు, 78 టీ20లు ఆడాడు.
తుది జట్లు
భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మేయర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్