IND vs IRE: ద్రావిడ్ కాదు, లక్ష్మణ్ కాదు.. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు కొత్త కోచ్!

ABN , First Publish Date - 2023-08-13T15:29:28+05:30 IST

భారత క్రికెట్ జట్టుకు మరో కొత్త కోచ్ రానున్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐర్లాండ్ పర్యటన సందర్భంగా కొత్త కోచ్‌ను తీసుకురానున్నారని సమాచారం. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌కు ఐర్లాండ్ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించనున్నారు.

IND vs IRE: ద్రావిడ్ కాదు, లక్ష్మణ్ కాదు.. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు కొత్త కోచ్!

భారత క్రికెట్ జట్టుకు మరో కొత్త కోచ్ రానున్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐర్లాండ్ పర్యటన సందర్భంగా కొత్త కోచ్‌ను తీసుకురానున్నారని సమాచారం. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌కు ఐర్లాండ్ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించనున్నారు. అయితే ద్రావిడ్ గైర్హాజరీలో ఐర్లాండ్‌ పర్యటనలో టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఉంటారని మొదట అంతా భావించారు. పైగా గతంలో ద్రావిడ్ గైర్హాజరీలో టీమిండియా హెడ్ కోచ్‌గా లక్ష్మణే వ్యవహరించాడు. అయితే ప్రస్తుతం లక్ష్మణ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్‌గా ఉన్నాడు. రానున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్సీఏలో ఆగష్టు 16 నుంచి సెప్టెంబర్ 5 వరకు లక్ష్మణ్ అధ్వర్యంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించనున్నారు. ఈ కారణంతోనే ఐర్లాండ్ పర్యటనకు లక్ష్మణ దూరంగా ఉంటున్నాడని సమాచారం. దీంతో ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా ప్రధాన కోచ్‌ బాధ్యతలను నూతన వ్యక్తికి అప్పగించనున్నారు.


మాజీ దేశవాళీ ఆటగాడు సితాన్షు కోటక్‌ను ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమించనున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం సితాన్షు ఎన్సీఏలో భారత-ఏ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. సితాన్షు కోచింగ్‌లోనే రెండేళ్లుగా భారత-ఏ జట్టు బరిలోకి దిగుతుంది. ఇక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులేని నియమించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సితాన్షు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో కావాల్సినంత అనుభవం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 89 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. ఇక సాయిరాజ్ బహుతులే విషయానికొస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 2 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. స్పిన్ బౌలరైనా సాయిరాజ్ టెస్టుల్లో 3, వన్డేల్లో 2 వికెట్లు తీశాడు.

కాగా ఈ నెల 18 నుంచి 23 మధ్య ఐర్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో సెలెక్టర్లు ఇప్పటికే జట్టును ఎంపిక చేశారు.

టీమిండియా స్క్వాడ్

జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

Updated Date - 2023-08-13T15:29:58+05:30 IST