Share News

Microsoft: విండోస్ 10కి ముగింపు పలకనున్న మైక్రోసాఫ్ట్?

ABN , Publish Date - Dec 22 , 2023 | 08:46 PM

విండోస్ 10 (Windows) ఆపరేటింగ్ సిస్టమ్‌కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్ప్ (Mircrosoft) గుడ్‌బై చెప్పాలని చూస్తోందా?. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందా?. అంటే ఔననే చెబుతున్నాయి రిపోర్టులు.

Microsoft: విండోస్ 10కి ముగింపు పలకనున్న మైక్రోసాఫ్ట్?

విండోస్ 10 (Windows) ఆపరేటింగ్ సిస్టమ్‌కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్ప్ (Mircrosoft) గుడ్‌బై చెప్పాలని చూస్తోందా?. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందా?. అంటే ఔననే చెబుతున్నాయి రిపోర్టులు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సహాయాన్ని నిలిపివేసేందుకు మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ‘కెనాలిస్ రీసెర్చ్’ రిపోర్ట్ పేర్కొంది. ఇదే గానీ జరిగితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 మిలియన్ల పర్సనల్ కంప్యూటర్లు మూలన పడతాయని, దీని మూలంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు గణనీయంగా పెరిగే అవకాశముంటుందని అంచనా వేసింది. విండోస్ 10 ఓఎస్‌కు మైక్రోసాఫ్ట్ సహాయాన్ని నిలిపివేసిన కొన్నేళ్ల తర్వాత కూడా కంప్యూటర్లు పనిచేస్తాయని, అయితే సెక్యూరిటీ అప్‌డేట్స్ లేని డివైజ్‌లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుందని విశ్లేషించింది. కాగా మైక్రోసాఫ్ట్ నిర్ణయంతో ఏర్పడే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 320,000 కార్లకు సమానంగా 480 మిలియన్ కిలోల బరువు ఉంటాయని అంచనాగా ఉంది.

Updated Date - Dec 22 , 2023 | 08:46 PM