Share News

Telangana Results: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌ దే ఆధిక్యం.. వెనకంజలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు

ABN , First Publish Date - 2023-12-03T10:56:52+05:30 IST

Telangana Results: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Telangana Results: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌ దే ఆధిక్యం.. వెనకంజలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వరంగల్ తూర్పు, పశ్చిమ, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా.. స్టేషన్ ఘనపూర్, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకబడ్డారు. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. అలాగే మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ కూడా వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు సీతక్క, కొండా సురేఖ ముందంజలో కొనసాగుతుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2023-12-03T10:56:54+05:30 IST