Share News

Hyd CP: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్.. ఐదంచెల భద్రత

ABN , First Publish Date - 2023-11-28T18:50:28+05:30 IST

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్ శాండిల్య తెలపారు.

Hyd CP: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్.. ఐదంచెల భద్రత

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని సీపీ సందీప్ శాండిల్య తెలపారు. ఎన్నికల ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని పేర్కొన్నారు. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ తెలిపారు.

"ఐదుగురికి మించి ఎక్కడైనా గుమ్గడితే చర్యలు తప్పవు. ఎన్నికల ముగిసేవరకు కొనసాగుతున్న 144 సెక్షన్. బార్లు ,వైన్ షాపులు ,పబ్బులు మూసివేయాలి. మూడు రోజులపాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు. ట్రైసిటీ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు. బందోబస్తులో 70 కంపెనీల కేంద్ర బలగాలు. పోలింగ్ బూత్, రూట్ మొబైల్, పెట్రోలింగ్, బ్లూ కౌల్ట్స్ తో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో సత్వర ప్రత్యేక బృందాలు. మూడు కమిషనరేట్ల పరిధిలో 30 వేల మందికిపైగా బందోబస్తు. బుధవారం సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. పోలింగ్ రోజు అల్లర్లు జరిగితే నిమిషాల్లో స్పందించేందుకు ఐదంచేల భద్రత. రూట్ మొబైల్స్, పెట్రోలింగ్, బ్లూకౌల్ట్స్ సిబ్బందితో తొలిదశ. రెండోవదశ రూట్ మొబైల్ ద్వారా సమస్యాత్మక కేంద్రాల్లో నిరంతర గస్తీ. మూడో దశ ఒక ఇన్‌స్పెక్టర్‌తో క్విక్ రెస్పాన్స్ టీమ్. నాలుగో దశ ఏసీపీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్. ఐదోదశలో డీసీపీ ఆధ్వర్యంలో రిజర్వ్ ఫోర్స్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో కేంద్ర బలగాలు. ట్రైకమిషనరేట్ పరిధిలో వెయ్యి వరకు సమస్యాత్మక కేంద్రాలు. పోలింగ్ కేంద్రాల వద్ద బుధవారం సాయంత్రం నుంచి 1వ తేదీ ఉదయం 6గంటల వరకు ఆంక్షలు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధిలో ఆయుధాలు, కర్రలు, ర్యాలీలు సమావేశాలు నిషేధం. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు 20 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకుమించి గుమ్మిగూడకుండా ఆదేశాలు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారాలు, విద్వేషాకర ప్రసంగాలు నిషేధం." అని సీపీ స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-28T18:51:21+05:30 IST