Share News

T.High Court: మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్ ఎన్నికల నామినేషన్‌పై హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2023-11-17T12:54:24+05:30 IST

Telangana Elections: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాఘువేంద్ర రాజు అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

T.High Court: మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్ ఎన్నికల నామినేషన్‌పై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Sirinivas Goud) ఎన్నికల నామినేషన్‌పై (Election Namination) అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలైంది. రాఘువేంద్ర రాజు అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన నామినేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినా ఎన్నికల రీటర్నింగ్ అధికారి పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

శ్రీనివాస్ గౌడ్ వేసిన అఫిడవిట్, నామినేషన్‌లో వాస్తవాలు తొక్కిపెట్టారని పిటిషన్‌లో తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ రాఘవేంద్రరాజు పిటిషన్ వేశారు. అలాగే మంత్రి శ్రీనివాసగౌ్‌డ్ భార్య వృత్తికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదని పిటిషన్‌లో తెలిపారు. పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. పిటిషనర్ అభ్యంతరాలను చూడాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ రాఘవేంద్ర రాజుకు పూర్తి లీబర్టీ ఇచ్చిన హైకోర్టు.. పిటిషన్‌ను ముగించేసింది.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-17T12:54:25+05:30 IST