Share News

TS Elections: రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2023-11-28T20:34:31+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేశారు.

TS Elections: రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు

కామారెడ్డి జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ఎన్నికల ప్రచారం అయ్యాక ఎవరు ఔటర్స్ ఉండకూడదని కొండల్ రెడ్డికి పోలీసులు తెలిపారు. పర్సనల్ ఐడీతో ఎందుకు ఉన్నారంటూ పోలీసులు అధికారులు నిలదీశారు. ఎవరు ఉండవద్దు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు.

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాలతో నేతలు హోరెత్తించారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్, ఈటల రాజేందర్ ప్రచారం సాగించారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ సీనియర్లు, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.

విమర్శలు, ప్రతి విమర్శలతో నేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై బీఆర్ఎస్ ప్రచారం చేసింది. 6 గ్యారంటీలు, బీఆర్ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. సకల జనుల మేనిఫెస్టోపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక ప్రలోభాలపై పార్టీలు దృష్టి పెట్టాయి. పోల్ మేనేజ్ మెంట్‌నే నేతలు నమ్ముకున్నారు.

Updated Date - 2023-11-28T21:48:15+05:30 IST