Share News

BRS: ఇక మొదలైంది... బీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత రాజీనామా

ABN , First Publish Date - 2023-12-05T11:17:10+05:30 IST

ముషీరాబాద్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌(BRS) అధ్యక్షుడు నర్సింగ్‌ ప్రసాద్‌(Narsingh Prasad) పదవికి,

BRS: ఇక మొదలైంది... బీఆర్‌ఎస్‌కు సీనియర్ నేత రాజీనామా

ముషీరాబాద్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌(BRS) అధ్యక్షుడు నర్సింగ్‌ ప్రసాద్‌(Narsingh Prasad) పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఎమ్మెల్యే ముఠాగోపాల్‌(MLA Muthagopal)కు పంపారు. సోమవారం ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 33 సంవత్సరాలుగా ముఠా గోపాల్‌ అనుచరుడిగా ఉన్నానని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులను పక్కన పెడుతున్నారని, వయసుకు కూడా గౌరవం ఇవ్వడం లేదని అందుకే రాజీనామా చేశానని తెలిపారు. దానితోపాటు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

gg.jpg

Updated Date - 2023-12-05T11:17:12+05:30 IST