KCR: గవర్నర్ తేనీటి విందుకు వరుసగా మూడోసారి సీఎం కేసీఆర్ డుమ్మా

ABN , First Publish Date - 2023-08-15T19:57:24+05:30 IST

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో (Telangana Raj Bhavan) తేనీటి విందు ప్రారంభమైంది.

KCR: గవర్నర్ తేనీటి విందుకు వరుసగా మూడోసారి సీఎం కేసీఆర్ డుమ్మా

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో (Telangana Raj Bhavan) తేనీటి విందు ప్రారంభమైంది. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జాస్తి, సీఎస్, డీజీపీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.


రాజ్‌భవన్ నుంచి ప్రగతి భవన్‌కు ఆహ్వానం వెళ్లినప్పటికీ హైదరాబాద్ "రాజ్ భవన్ ఎట్ హోమ్" కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దూరంగా ఉన్నారు. వరుసగా మూడోసారి రాజ్‌భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. కేబినెట్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వలేదు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకుల హడావిడి కనిపించలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ బీజేపీ కీలక నేతలు కూడా హాజరుకాలేదు.


కేసీఆర్ గురించి..!

రాజ్ భవన్‌లో (Raj Bhavan) తేనీటి విందుకు కేసీఆర్‌ను ఆహ్వానించామని గవర్నర్ తెలిపారు. అయితే సీఎం రావడం, రాకపోవడం అనేది రాజ్ భవన్ పరిధిలో లేదని గవర్నర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరి తనను తీవ్రంగా బాధించిందని తమిళిసై ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్లపై ముఖ్యమంత్రుల తీరు ఇలా ఉండటం ఎప్పటికి మంచిది కాదన్నారు. కాగా.. ఇవాళ్టి తేనేటి విందు కార్యక్రమానికి కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు.

Updated Date - 2023-08-15T20:16:54+05:30 IST