Share News

Chandrababu: కాసేపట్లో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు

ABN , First Publish Date - 2023-11-04T10:58:39+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు.

Chandrababu: కాసేపట్లో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మరికాసేపట్లో ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు (LV Prasad Hospital)వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు టీడీపీ చీఫ్ చేరుకోనున్నారు. ఈరోజు చంద్రబాబుకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే డాక్టర్లు సూచించిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ ఎప్పుడు చేయలన్నదానిపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ చీఫ్ వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. జూన్‌లో ఎడమ కంటికి చంద్రబాబు సర్జరీ చేయించుకున్నారు. ఈరోజు కుడి కంటికి సర్జరీ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2023-11-04T10:58:40+05:30 IST