Share News

TS Election: రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర ఖరారు.. పాల్గొననున్న రాహుల్, ప్రియాంక

ABN , First Publish Date - 2023-10-24T11:38:32+05:30 IST

తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల

TS Election: రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర ఖరారు.. పాల్గొననున్న రాహుల్, ప్రియాంక

హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 వరకు రెండో విడత బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొననున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో బస్సు యాత్రలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొననున్నారు. 30, 31 తేదీల్లో ప్రియాంక గాంధీ.. వచ్చే నెల 1న బస్సుయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్ర సాగేలా తెలంగాణ పీసీసీ ప్లాన్ చేసింది. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రెండో విడత బస్సు యాత్ర సాగనుంది.

Updated Date - 2023-10-24T11:38:36+05:30 IST