Share News

Hyderabad: ప్రపంచంలోనే మొదటి 3 డి గుడి వావ్ కదా.. అది కూడా మన తెలంగాణలో వావ్.. వావ్.. వావ్..

ABN , First Publish Date - 2023-11-22T08:39:39+05:30 IST

3డి గుడి అంటే వినడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా. వెంటనే చూసేయాలి అనిపిస్తోంది. ఆ గుడి ఎక్కడో కాదు.. మన తెలంగాణలోని సిద్ధిపేటలో నిర్మితమవుతోంది. మానిఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సంస్థ సింప్లిఫోర్జ్ క్రియేషన్స్‌తో కలిసి హైదరాబాద్ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ నిర్మించిన ఈ ఆలయాన్ని 3డి ప్రింట్ చేయడానికి మూడు నెలల సమయం పట్టింది.

Hyderabad: ప్రపంచంలోనే మొదటి 3 డి గుడి వావ్ కదా.. అది కూడా మన తెలంగాణలో వావ్.. వావ్.. వావ్..

హైదరాబాద్ : 3డి గుడి అంటే వినడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా. వెంటనే చూసేయాలి అనిపిస్తోంది. ఆ గుడి ఎక్కడో కాదు.. మన తెలంగాణలోని సిద్ధిపేటలో నిర్మితమవుతోంది. మానిఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సంస్థ సింప్లిఫోర్జ్ క్రియేషన్స్‌తో కలిసి హైదరాబాద్ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ నిర్మించిన ఈ ఆలయాన్ని 3డి ప్రింట్ చేయడానికి మూడు నెలల సమయం పట్టింది. 35.5 అడుగుల పొడవు..4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మితమూంది. మూడు భాగాల నిర్మాణంలో మూడు గర్భాలయాలు ఉన్నాయి.

గణేశుడికి మోదకం, శివుడికి చతురస్రాకారంలో శివాలయం, పార్వతి దేవి కోసం కమలం ఆకారంలో మూడు గోపురాలున్నాయి. మూడు గోపురాలు, మూడు గర్భాలయాలను సింప్లిఫోర్జ్ తన రోబోటిక్స్ కన్‌స్ట్రక్షన్ 3డి ప్రింటింగ్ సదుపాయాన్ని ఉపయోగించి అద్భుతంగా నిర్మించింది. దేశీయ మెటీరియల్‌తో పాటు సాఫ్ట్‌వేర్ సహాయంతో దాదాపు 70-90 రోజులలో 3డి ప్రింట్ చేసింది. ఇక మిగిలిన పిల్లర్లు.. స్లాబ్‌లు, ఫ్లోరింగ్‌ను కన్వెన్షనల్ కన్‌స్ట్రక్షన్ టెక్నిక్స్ నిర్మించింది. మొత్తంగా ఆలయ నిర్మాణానికి ఐదున్నర నెలల సమయం పట్టింది.

Updated Date - 2023-11-22T08:41:40+05:30 IST