YS Sharmila: బీఆర్‌ఎస్‌‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే.. షర్మిల ఎద్దేవా

ABN , First Publish Date - 2023-07-26T14:57:04+05:30 IST

అధికార పార్టీపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.

YS Sharmila: బీఆర్‌ఎస్‌‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే.. షర్మిల ఎద్దేవా

హైదరాబాద్: అధికార పార్టీపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మరోసారి విరుచుకుపడ్డారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (Vanama Venkateshwar rao) ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పుపై స్పందించిన షర్మిల... బీఆర్‌ఎస్‌‌లో (BRS) ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే అంటూ ఎద్దేవా చేశారు. అంతా ఎన్నికల కమిషన్‌ను తప్పు దోవ పట్టించిన వాళ్లే అని వ్యాఖ్యలు చేశారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలే అన్నారు. ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత అని తెలిపారు. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి.. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ షర్మిల కోరారు.

Updated Date - 2023-07-26T14:57:04+05:30 IST