Share News

Ponguleti: తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ దోచుకోడానికేనా?

ABN , First Publish Date - 2023-11-16T14:46:20+05:30 IST

ఖమ్మం జిల్లా: పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ప్రచారంలో పాల్గొన్నారు.

Ponguleti: తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ దోచుకోడానికేనా?

ఖమ్మం జిల్లా: పాలేరు కాంగ్రెస్ (Congress) అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) సీఎం కేసీఆర్‌ (CM KCR)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారని, తొమ్మిదేళ్లలో ఆయన తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ (Telangana) తెచ్చుకుంది కేసీఆర్ దోచుకోడానికేనా? అన్నట్లుగా ముఖ్యమంత్రి నడవడిక ఉందని అన్నారు.

ఈనాటి పరిస్థితి చూస్తుంటే తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవన్నీ మనందరం కేసీఆర్‌కు తాకట్టు పెట్టినట్లు ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇళ్ళు, రేషన్ కార్డులు ఏవీ ఇవ్వలేదని, ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రజలు ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాలని పిలుపిచ్చారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ నాయకుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. భూమిలేని పేదలకు సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తామని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని అన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు కావాలంటే.. హస్తం గుర్తుపై ఓటేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపిచ్చారు.

Updated Date - 2023-11-16T14:46:21+05:30 IST