Share News

Mahamood Ali:కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. మహమూద్ అలీ కామెంట్స్

ABN , First Publish Date - 2023-11-05T17:20:13+05:30 IST

సీఎం కేసీఆర్‌(CM KCR) ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy) ఓ బచ్చా అని హోం మంత్రి మహమూద్ అలీ(Mahamood Ali) ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాలులో జరిగిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ ఆర్ఆర్ఎస్ మనిషని.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ(BJP) కోవర్ట్ అని ఆరోపించారు.

Mahamood Ali:కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. మహమూద్ అలీ కామెంట్స్

కామారెడ్డి: సీఎం కేసీఆర్‌(CM KCR) ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy) ఓ బచ్చా అని హోం మంత్రి మహమూద్ అలీ(Mahamood Ali) ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాలులో జరిగిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ ఆర్ఆర్ఎస్ మనిషని.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ(BJP) కోవర్ట్ అని ఆరోపించారు. కొడంగల్(Kodangal)లో చెల్లని రూపాయి కామారెడ్డి(Kamareddy)లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టం అని అలీ పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మతకల్లోలాలు తప్పా అభివృద్ధి జరగదని విమర్శించారు. కాంగ్రెస్(Congress) హయాంలో కర్ఫ్యూలు తప్పా... అభివృద్ధి జరగలేదని అన్నారు. రేవంత్ రెడ్డికి కామారెడ్డి ప్రజలు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన కేసీఆర్ సర్కార్ ను మరో సారి దీవించాలని కోరారు. మైనార్టీలకు అన్ని రకాలుగా ఆదుకుంటుంది కేసీఆర్ అని వెల్లడించారు. బీఆర్ఎస్‌తోనే రానున్న రోజుల్లో మైనార్టీల సంక్షేమం సాధ్యమని వివరించారు. ముఖ్యమంత్రిని నియోజకవర్గ ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

Updated Date - 2023-11-05T17:22:55+05:30 IST