MLA Rajaiah: నా బలం.. నా బలగం వారే..
ABN , First Publish Date - 2023-09-04T21:48:36+05:30 IST
మాదిగల అస్థిత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah) అన్నారు. సోమవారం నాడు మాదిగల ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం నిర్వహించారు.
వరంగల్ : మాదిగల అస్థిత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah) అన్నారు. సోమవారం నాడు మాదిగల ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ..మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై కసితో ఇక్కడికి వచ్చాను.మాదిగల సత్తా ఏంటో చూపాలి. నాబలం నాబలగం మాదిగలే.మీరే నా ఆయుధాలు. రెడ్లు, వెలమలు మీటింగ్ పెట్టుకోగా మాదిగలు మీటింగ్ పెడితే ఏమైంది. మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం అందరం కలిసి పనిచేయాలి’’ అని రాజయ్య పేర్కొన్నారు.