Share News

Ambati Rambabu: సంజన, సుకన్యలతో చంద్రబాబు ప్రమాణానికి రండి!

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:13 PM

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటికి చీర.. జాకెట్, పూలు ఇచ్చేందుకు తెలుగు విద్యార్థి నేతలు వెళ్లారు. సుకన్య, సంజనాలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వనం అందించేందుకు వెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

 Ambati Rambabu: సంజన, సుకన్యలతో చంద్రబాబు ప్రమాణానికి రండి!

గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటికి చీర.. జాకెట్, పూలు ఇచ్చేందుకు తెలుగు విద్యార్థి నేతలు వెళ్లారు. సుకన్య, సంజనాలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వనం అందించేందుకు వెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగు విద్యార్థి నేతలు.. అంబటి ఇంటి ముందు కుర్చీలో పెట్టి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీ, రాయపాటి అమృతరావు తదితరులు పాల్గొన్నారు.


అధికారంలో ఉండగా అంబటి రాంబాబుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇష్టానుసారంగా మాటలతో చంద్రబాబుపై దాడి చేసేవారు. జగన్ మెప్పు కోసమో.. లేదంటే వైసీపీపై మితిమీరిన అభిమానమో కానీ టీడీపీ అధినేత సహా ఇతర నేతలందరిపై దూషణలకు దిగేవారు. ఈసారి కూడా వైసీపీనే వస్తుందన్న ధీమాతో ఆయన రెచ్చిపోయేవారు. దీనిని దృష్టిలో పెట్టుకునే టీడీపీ నేతలు ఆయనకు పై విధంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు.

Updated Date - Jun 10 , 2024 | 12:31 PM