Share News

STUDENTS : టీచర్‌ బదిలీని రద్దు చేయాలని వినతి

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:22 AM

ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా పెద్దిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్‌ బోధిస్తున్న ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని శ్రీరంగరాజులపల్లికి బదిలీచేశారు. అయితే టీచర్‌ బదిలీని రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత వారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.

STUDENTS : టీచర్‌ బదిలీని రద్దు చేయాలని వినతి
Parents of students submitting petition to MEO

హిందూపురం(పరిగి), సెప్టెంబరు 9 : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా పెద్దిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్‌ బోధిస్తున్న ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మిని శ్రీరంగరాజులపల్లికి బదిలీచేశారు. అయితే టీచర్‌ బదిలీని రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత వారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. ఇప్పటి దాకా టీచర్‌ బదిలీని రద్దు చేయక పోవడంతో సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండల విద్యాశాఖాధికారి కార్యాల యంలో ఎంఈఓ లక్ష్మీదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీచర్‌ భాగ్యలక్ష్మి బదిలీని రద్దు చేసే విధంగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎంఈఓకు వినతిపత్రం అందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 10 , 2024 | 12:22 AM