Share News

AID TO VICTIMS : వరద బాధితులకు సాయం

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:09 AM

వరదలతో అతలాకుతలైన విజయవాడ ప్రాంత వాసులను ఆదుకుందామని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని రహమతపురం సర్కిల్‌, బాలాజీ సర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌, మెయిన బజార్‌లలో బుధవారం వరద బాధితుల సహయార్థం వారు విరాళాలు సేకరించారు. రూ.30270 వసూలు చేశామని ఈ మొత్తాన్ని వరదబాధితుల సహయ నిధికి అందజే స్తామన్నారు.

AID TO VICTIMS : వరద బాధితులకు సాయం
Labor union leaders collecting donations in gorants

హిందూపురం అర్బన, సెప్టెంబరు 12: వరదలతో అతలాకుతలైన విజయవాడ ప్రాంత వాసులను ఆదుకుందామని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని రహమతపురం సర్కిల్‌, బాలాజీ సర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌, మెయిన బజార్‌లలో బుధవారం వరద బాధితుల సహయార్థం వారు విరాళాలు సేకరించారు. రూ.30270 వసూలు చేశామని ఈ మొత్తాన్ని వరదబాధితుల సహయ నిధికి అందజే స్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్‌కుమార్‌, కార్యవర్గ సభ్యుడు సమీవుల్లా, కమల్‌భాష, చాంద్‌బాషా, గంగాధర్‌, శీనప్ప, శివకుమార్‌,. కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


గోరంట్ల: పట్టణంలోని గుమ్మయ్యగారిపల్లి క్రాస్‌రోడ్డు వద ్దనుంచి గోరంట్ల ప్రధాన రహదారిపై వరదబాధితుల కోసం కేవీపీఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజలనుంచి గురువారం విరాళాలు సేకరిం చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు స్వర్ణలత, కేవీపీఎస్‌ జిల్లా అద్యక్షులు హనుమయ్య, కార్మికులు విరాళాలు సేకరించారు. రూ. 15,300 విరాళాలు సేకరించామని, ఈమొత్తాన్ని తమ సీఎం సహాయ నిధి కి అందజేయనున్నట్లు తెలిపారు.

అగళి : విజయవాడ వరద బాధితుల కోసం మండల పరిధిలోని కోడిపల్లి పంచాయతీ జంగమరణపల్లి వాసులు రూ.11,841 అందజేశారు. దానిని గురువారం ముఖ్యమంత్రి సహాయనిధికి పంపినట్లు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 13 , 2024 | 12:10 AM