Share News

THEFTS : వరుస చోరీలతో బెంబేలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:50 PM

వ్యాపార పరంగా దిన దినాభివృద్ధి చెందుతున్న మండలకేంద్ర మైన నార్పలలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తు న్నాయి. రోజూ రాత్రైతే చాలు ఎవరి ఇంట్లో దొంగలు చొర బడుతారో అనే భయం వారిలో నెలకొంది. కేవలం ఒకటి న్నర నెల వ్యవధిలోనే పెద్ద పెద్ద దొంగతనాలు జర గడం తో మండలకేంద్రం వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

THEFTS : వరుస చోరీలతో బెంబేలు
Thugs who broke open the door of Obayya's house (File)

రాత్రిళ్లు భయాందోళనలో నార్పల వాసులు

నార్పల, సెప్టెంబరు 16: వ్యాపార పరంగా దిన దినాభివృద్ధి చెందుతున్న మండలకేంద్ర మైన నార్పలలో వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తు న్నాయి. రోజూ రాత్రైతే చాలు ఎవరి ఇంట్లో దొంగలు చొర బడుతారో అనే భయం వారిలో నెలకొంది. కేవలం ఒకటి న్నర నెల వ్యవధిలోనే పెద్ద పెద్ద దొంగతనాలు జర గడం తో మండలకేంద్రం వాసులు నిద్రలేని రాత్రులు గడుపుతు న్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయినా పో లీసులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికే దొంగతనాల కేసులు పదుల సంఖ్యలో నమోదయ్యాయి. కొన్ని చోరీల విషయంలో ఆ ఇళ్లలో ఏమీ దొరకక దొంగలు వెనుదిరి గిన సంఘటనలు ఉన్నాయి. అలాంటివి సంఘటనల్లో దొంగలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా పోలీసులు వారిని ఏమి చేయలేక మౌనం దాల్చడంపై అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు దొంగలను పట్టుకోకుండా ఇళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు. చాలా మంది బాధితుల్లో పిల్లల పెళ్లిళ్ల కోసం, ఆరోగ్యం బాగాలేదని తెచ్చి పెట్టుకున్న బంగారం నగలు, నగదును దోచుకెళ్లారని బాధితుల ద్వారా తెలుస్తోంది.

ఒకటిన్నర నెలలో జరిగిన చోరీలు

కేవలం ఒకటిన్నర నెలలోనే నార్పలలో జరిగిన చోరీలకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి నార్పల కు చెందిన చిలమకూరి శివశంకర్‌ ఇంట్లో నాలుగు తులాల బంగారం, రూ.1.60లక్షలు ఎత్తుకెళ్లారు. గురుప్రసాద్‌ ఇంట్లో రెండు తులాల బంగా రం, రూ. 90వేలు, కత్తెర వెంకటరాముడు ఇంట్లో రూ.2.45లక్షలు, 5తులా ల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే ఓబయ్య ఇంట్లో 20తులాల బంగారం, రూ. 60వేలు ఎత్తుకెళ్లారు. గందోడి నాగేంద్ర ఇంట్లో రూ.1.45లక్షలు, ఐదున్నర తులాల బంగారం, పులసల నూతల రాముడు ఇంట్లో ఆరు తులాల బంగారం, రూ. లక్ష చోరీ చేశారు. అలాగే నార్పలలోనే దాదాపు 15నుంచి 20 వరకు దొంగతనాలు జరిగినా వాటిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేసినట్లు సమాచారం.


నూతన సీఐ, ఎస్‌ఐకి సవాలుగా మారిన చోరీలు

బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదుల ప్రకారం... నార్పలలో ఇప్పటి వరకు జరిగిన చోరీల్లో పలు ఇళ్లలో 43తులాల బంగారం, రూ.8లక్షలు దొంగలు ఎత్తు కెళ్లారు. వారం క్రితం శింగనమల సీఐగా కౌలుట్లయ్య, నార్పల మండలం ఎస్‌ఐగా సాగర్‌ బాధ్యతలు చేప ట్టారు. నార్పలలోని ఉద్దిబావి చేను కాలనీలో 15 రోజుల క్రితం పులసలనూతల రాముడు ఇంట్లో ఆరు తులాల బంగారం, రూ. లక్ష ఎత్తుకెళ్లిన దొంగలు నూతన సీఐ, ఎస్‌ఐలకు సవాల్‌ విసిరారు. ఇప్పటి వరకు చోరీ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

సంతలో 60కి పైగా సెల్‌ఫోనలు మాయం

మండల కేంద్రమైన నార్పలో ప్రతి శనివారం కూరగాయాల సంత నిర్వహిస్తారు. ఈ సంతకు 36గ్రామాలకు చెందిన వారు వస్తారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు మార్కెట్‌లో చొరబడి మహిళలు, వృద్ధుల వద్ద నుంచి దాదాపు 60కి పైగా సెల్‌ ఫోన చోరీలు జరిగినా, పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇదే క్రమంలో పది రోజుల క్రితం విజయవాడకు చెందిన ఓ యువకుడు, కర్నూలుకు చెందిన మరో యువకుడు సెల్‌ఫోన చోరీ చేస్తుండగా స్ధానికులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే వారిని పోలీసులు వదిలేసినట్లు సమాచా రం. ఇప్పటికైన ఉన్నతస్ధాయి అధికారులు స్పందించి చోరీ కేసులను ఛేదించడంతో పాటు దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 16 , 2024 | 11:50 PM