Share News

Kiran Kumar Reddy: పోలవరం పూర్తయితే సస్యశ్యామలంగా సీమ

ABN , Publish Date - Aug 13 , 2024 | 08:53 PM

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ప్రాజెక్ట్ పూర్తయితే సీమకు సాగునీరు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని వివరించారు. న్యాయ, నీటి సూత్రాలకు విరుద్ధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందన్నారు.

Kiran Kumar Reddy: పోలవరం పూర్తయితే సస్యశ్యామలంగా సీమ
Kiran Kumar Reddy

అనంతపురం: పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అభిప్రాయ పడ్డారు. ప్రాజెక్ట్ పూర్తయితే సీమకు సాగునీరు ఢోకా ఉండదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతుందని వివరించారు. న్యాయ, నీటి సూత్రాలకు విరుద్ధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణకు పూర్తిగా నష్టం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో పాత జిల్లాలను కొనసాగిస్తే బాగుండేదని సూచించారు. నేను సీఎంగా ఉంటే ఆ పని చేసే వాడిని తేల్చి చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల అస్తిత్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.


chandrababu.jpg


కష్టమే..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. గత ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారి పోయానని మాజీ సీఎం కిరణ్ కుమార్ వివరించారు. సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు కూడా ఐదేళ్ల పాలన కష్టంతో కూడుకున్న పని అని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు.. రెవెన్యూ శాఖను అస్తవ్యస్తంగా చేశారని గుర్తుచేశారు. ఆ రెండు కీలక అంశాలను సరిచేసేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. నెలల్లో సరిచేయడం సాధ్యం కాదని అభిప్రాయ పడ్డారు.


chandrababu-people.jpg


అమరావతి కూడా..

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ తేలలేదని మాజీ సీఎం కిరణ్ కుమార్ గుర్తుచేశారు. హత్య కేసులో దోషులు ఎవరో తేలేందుకు కాలయాపన జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌తో పాటు అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని కోరారు. వీలైనంత త్వరగా రాజధానిని నిర్మించాలని సూచించారు. దాంతో రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 08:55 PM