HOSPITAL : మధ్యాహ్నానికే ఖాళీ
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:13 AM
పేరుకే కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దీంతో రోగు లు ఇది పెద్ద ఆస్పత్రి అని చికిత్స కోసం వస్తా రు. అయితే ఇక్కడి పరిస్థితులు అంతంత మా త్రంగానే ఉన్నాయి. దీంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వచ్చిన వారు నిరాశతో వేరొక చోటుకు వెళ్లాల్సి వస్తోంది. సోమ వారం ఆంధ్రజ్యోతి విజిట్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి.
డ్యూటీ నర్సుతోనే వైద్యం
శింగనమల సీహెచసీ తీరు ఇలా...
శింగనమల, నవంబరు 18(ఆంధ్రజ్యోతి) : పేరుకే కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దీంతో రోగు లు ఇది పెద్ద ఆస్పత్రి అని చికిత్స కోసం వస్తా రు. అయితే ఇక్కడి పరిస్థితులు అంతంత మా త్రంగానే ఉన్నాయి. దీంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. వచ్చిన వారు నిరాశతో వేరొక చోటుకు వెళ్లాల్సి వస్తోంది. సోమ వారం ఆంధ్రజ్యోతి విజిట్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. శింగనమల కమ్యూనిటీ ఆసు పత్రిలో ఐదుగురు వైద్యులు విధులు నిర్వహిస్తు న్నారు. వారంతా ఉదయం అంటుబాటులో ఉం డాలి. వారంతా సోమవారం ఉదయం ఆసుప త్రికి వచ్చారు. అయితే అందులో నలుగు మధ్యా హ్నం 12.30 గంటలకు వెళ్లి పోయారు. సాయంత్రం 4గంటల సమయంలో ఆ ఒక్కరు కూడా లేరు. ఆ సమయంలో మండలపరిధిలోని గురుగుంట్ల గ్రామానికి చెందిన మహిళ, నాగుల గుడ్డం తండాకు చెందిన వ్యక్తి వైద్య చికిత్సల కోసం వచ్చారు. పిల్లల వైద్యుడు కార్యాలయం లో ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అయి తే అక్కడే ఉన్న నర్సు వచ్చిన రోగులకు ఇంజ క్షన వేసి, కొన్ని మాత్రలు ఇచ్చి పంపారు. వై ద్యుడు ఎక్కడ అని సిబ్బందిని విచారించగా... సారు ఆఫీస్ పని మీద వెళ్లి పోయాడని గాబరా గాబరాగా చెప్పారు. ఇది 30 పడకల ఆసుపత్రి. సాయంత్రం, రాత్రి వైద్యులు అందుబాటు లేక పోతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాల కులు, అధికారులు సృందించి రాత్రి సమయంలో నూ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....