Share News

competitions : స్వచ్ఛతాహి సేవపై పోటీలకు స్పందన

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:28 AM

స్వచ్ఛతాహి సేవపై ఏపీ పొల్యూషన కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో గురువారం స్థానిక శారదానగర్‌లోని జేఎనటీయూ రోడ్డులో ఉన్న సైన్సుసెంటర్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇతర యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200మంది విద్యార్థు లు హాజరయ్యారు.

competitions : స్వచ్ఛతాహి సేవపై  పోటీలకు స్పందన
Students who participated in Essay Competitions

30న విజేతలకు బహుమతుల ప్రదానం

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 26 : స్వచ్ఛతాహి సేవపై ఏపీ పొల్యూషన కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో గురువారం స్థానిక శారదానగర్‌లోని జేఎనటీయూ రోడ్డులో ఉన్న సైన్సుసెంటర్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇతర యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200మంది విద్యార్థు లు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతాహి సేవ అమలు-సవాళ్లపై 45 నిముషాల పాలు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కురుగుంట అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థిని కుముద మొదటి బహుమతి, రాయదుర్గం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఝాన్సీ ద్వితీయ, బుక్కరాయసముద్రం కేజీబీవీ విద్యార్థిని యేసుకుమారి తృతీయ బహుమతి పొందారు.


వ్యర్థ రహిత ఇండియా స్థాపనలో యువత పాత్ర అనే అంశంపై వక్తృత్వపోటీల్లో మొదటి బహుమతి పెద్దవడుగూరు కేజివీవీ విద్యార్థిని జయశ్రీ మొదటి బహుమతి, అనంతపురం విశ్వభారతి స్కూల్‌ అఖిల్‌ కార్తికేయ ద్వితీయ, కణేకల్‌ గురుకుల పాఠశాల వినోద్‌కుమార్‌ నాయక్‌ తృతీయ బహుమతి సాధించారు. స్వచ్ఛతాహి సేవలో కమ్యూనిటీ భాగస్వామ్యంపై పోస్టర్ల త యారీలో నార్పల మహాత్మజ్యోతి రావు ఫూలే గురుకుల పాఠశాల విద్యార్థిని భవ్యశ్రీ మొదటి, రాయదుర్గం జడ్పీ ఉన్నత పాఠశాల నవ్యశ్రీ ద్వితీయ, కొర్రపాడు గురుకుల పాఠశాల విద్యార్థిని మోక్షిత తృతీయ బహుమతికి పొం దారు. స్వచ్ఛతాహి సేవ విజయవంతానికి ప్రజల్లో అవగాహన కల్పించే అంశంపై లఘుచిత్రాన్ని నిర్మించే పోటీల్లో ప్రథమ బహుమతి బొమ్మనహాల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలకు ప్రథమ, మోపిడి జడ్పీ ఉన్నత పాఠశాల ద్వితీయ, పాలవెంకటాపురం జడ్పీ ఉన్నతపాఠశాల, గుత్తి కేజీబీవీ తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు ఈనెల 30వతేదీన సైన్సు సెంటర్‌లో నిర్వహించే స్వచ్ఛతాహ సేవా కార్యక్రమంలో బహుమతు లు ప్రదానం చేస్తామని ఏపీ పొల్యూషన కంట్రోల్‌ బోర్డు శాఖ ఈఈ మునిప్రసాద్‌ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 27 , 2024 | 12:28 AM