GBC : రెండ్రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తాం : ఈఈ
ABN , Publish Date - Sep 11 , 2024 | 12:15 AM
గుంతకల్లు బ్రాంచ(జీబీసీ) ప్రధాన కాలువ నాలుగో కిలోమీటర్ ఉండబండ పెద్ద కోతకు గురైన గట్టుకు రెం డు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని జీబీసీ ఈఈ వెంకటరమణ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం డీఈ రఘుచరణ్, ఏఈలు పల్లవి, రాజశేఖర్, మంజునాథతో కలిసి కాలువపై పర్యటించి, దెబ్బతిన్న గట్టును పరిశీలించా రు.
కోతకు గురైన కాలువ గట్టు పరిశీలన
విడపనకల్లు, సెప్టెంబరు 10: గుంతకల్లు బ్రాంచ(జీబీసీ) ప్రధాన కాలువ నాలుగో కిలోమీటర్ ఉండబండ పెద్ద కోతకు గురైన గట్టుకు రెం డు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని జీబీసీ ఈఈ వెంకటరమణ పేర్కొ న్నారు. ఆయన మంగళవారం డీఈ రఘుచరణ్, ఏఈలు పల్లవి, రాజశేఖర్, మంజునాథతో కలిసి కాలువపై పర్యటించి, దెబ్బతిన్న గట్టును పరిశీలించా రు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ కాలువకు నాలుగో కిలో మీటర్ వద్ద అక్విడెట్ దారిపై భారీ వాహనం వెళ్లడంతో సైడ్ వాల్ కాలువలోకి కూలి పోయిందన్నారు. విషయం తెలుసుకున్న జీబీసీ అధికా రులు అప్రమత్తం కావడంతో భారి నీటి నష్టాన్ని అరికట్టామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లను పిలిపించామని, బుధవారం సాయంత్రానికి గండిని పూడ్చి సైడ్ వాల్ నిర్మిస్తామన్నారు.
బ్రిడ్జిలు పాతబడి పోవటంతోనే సమస్యలు : ఈఈ
జీబీసీకి ఉన్న బ్రిడ్జిలు పాత బడి పోవటంతోనే ఇలాంటి సమస్యలు ఏర్ప డుతున్నాయని ఈఈ వెంకటరమణ పేర్కొన్నారు. జీబీసీ హెడ్ జీరో బై జీరో వద్ద నుంచి 59వ కిలోమీటర్ వరకు దాదాపు 60 బ్రిడ్జిలు ఉన్నాయని, అవన్నీ 52 సంవత్సరాల క్రితం నిర్మించినన్నారు. కాలువ ఆధునికీకరణ పనులు చేసిన సమయంలో ఒకటో ప్యాకేజీలో మాత్రమే 90శాతం లైనింగ్ పనులు పూర్తి చేశారన్నారు. రెండో ప్యాకేజీలో కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఆధునీకీకరణ పనులు చేసి వదిలేశారు అన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయగా, ప్రభు త్వం మారిన తరువాత కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలేశాడన్నారు.. చేసిన పనులకు బిల్లులు రాక పోవటం రెండో ప్యాకేజీ పనులు పూర్తి కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కవిత, జీబీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....