Share News

Live Updates: జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్..

ABN , First Publish Date - Sep 21 , 2024 | 10:59 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Live Updates: జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్..
Breaking News

Live News & Update

  • 2024-09-21T13:29:23+05:30

    జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్..

    • జానీపై పోలీసు కేసు పెట్టాక.. ‌కమిటీ సభ్యులు ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి?

    • జానీ కేసు సినీ ఇండస్ట్రీపై తప్పుడు సంకేతాలను సృష్టించింది.

    • సినిమా పరిశ్రమలో అందరూ ప్రొఫెషనల్‌గా ఉంటూ పని చేసుకుంటారు.

    • కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మహిళా టెక్నిషియన్స్‌ను చూసి తోటి వారు ఇబ్బందిపడే పరిస్దితి నెలకొంది.

    • ఎప్పుడో లైంగికంగా వేధిస్తే ఇప్పుడు ఆరోపణలు చేయటం ఏంటి?

    • ఆరోపణలు చేసిన అమ్మాయికి ఏ నిర్మాత ఆఫర్స్ ఇస్తాడు?

    • ప్రతిభ, క్రమశిక్షణ ఉన్న వారికే ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయి.

    • గవర్నమెంట్ గైడ్ లైన్స్ వస్తే ఇండస్ట్రీలో కమిటీకి బలం చేకూరుతుందనేది నిజం కాదు.

  • 2024-09-21T11:33:38+05:30

    మానవత్వం చాటుకున్న మంత్రి లోకేష్

    మరోసారి మానవత్వం చాటుకున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

    రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వేముల నాగరాజు వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం

    ట్విట్టర్ ద్వారా మంత్రికి విన్నవించిన కుటుంబ సభ్యులు

    వెంటనే స్పందించి రూ.7 లక్షల సాయం అందించిన మంత్రి లోకేష్

    ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

  • 2024-09-21T11:31:47+05:30

    బోట్ల తొలగింపు

    • ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను తొలగించిన ఇరిగేషన్ అధికారులు

    • 15 రోజులు శ్రమించి కావడి వ్యూహంతో మూడు బోట్ల తొలగింపు

    • మూడు బోట్లను పున్నమి ఘాట్ కు తరలించిన ఇరిగేషన్ అధికారులు

  • 2024-09-21T11:25:44+05:30

    జనసేనలోకి వైసీపీ కీలక నేత

    • జనసేనలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య

    • రేపు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలోకి కిలారి రోశయ్య

    • ఇటివల వైసీపీకి రాజీనామా

    • సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ

    • పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన కిలారి రోశయ్య

  • 2024-09-21T11:16:57+05:30

    బెంగళూరుకు జగన్

    మరోసారి బెంగళూరు వెళ్లిన వైసీపీ అధ్యక్షులు జగన్

    ఎన్నికల ఫలితాల తర్వాత పదోసారి బెంగళూరు వెళ్లిన జగన్

  • 2024-09-21T11:10:44+05:30

    అక్రమ నిర్మాణాల కూల్చివేత

    • విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణం కూల్చివేత

    • కోర్టు ఆదేశాలతో భీమిలీ బీచ్‍లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

    • విశాఖ సముద్ర తీరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

    • సెప్టెంబర్ 4న ఓవైపు గోడను నామమాత్రంగా కూల్చివేసిన అధికారులు

    • హైకోర్టును ఆశ్రయించిన జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్

    • పూర్తిస్థాయిలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోర్టు ఆదేశాలు

    • కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు

  • 2024-09-21T10:59:11+05:30

    కార్పొరేటర్ల రాజీనామా

    • గుంటూరులో వైసీపీకి బిగ్ షాక్

    • పలువురు వైసీపీ కార్పొరేటర్ల రాజీనామా

    • 8, 13,18,56 డివిజన్లకు చెందిన కార్పొరేటర్ల రాజీనామా

    • జనసేనలో చేరనున్న నలుగురు కార్పొరేటర్లు