Andhra Pradesh: ఏపీ ప్రజలకు బిగ్ షాక్.. పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..
ABN , Publish Date - Nov 04 , 2024 | 01:21 PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ షాకింగ్ వార్త ఇది. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనుంది. వైసీపీ పాపాల ఎఫెక్ట్.. ఇప్పుడు ప్రజలపై పడనుంది. విద్యుత్ వినియోగదారుల నెత్తిన మళ్లీ ట్రూ అప్ ఛార్జీల పిడుగు పడనుంది.
అమరావతి, నవంబర్ 04: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ షాకింగ్ వార్త ఇది. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనుంది. వైసీపీ పాపాల ఎఫెక్ట్.. ఇప్పుడు ప్రజలపై పడనుంది. విద్యుత్ వినియోగదారుల నెత్తిన మళ్లీ ట్రూ అప్ ఛార్జీల పిడుగు పడనుంది. ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కమ్‌లు రూ. 11,826 కోట్ల ప్రతిపాదనలను ఈసీకి పంపాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఈఆర్‌సీకి ఈ ప్రతిపాదనలు పంపాయి డిస్కమ్‌లు. అయితే, డిస్కమ్‌ల ప్రతిపాదలను ఏపీఈఆర్‌సీ ఇప్పుడు బహిర్గతం చేసింది. ప్రతిపాదనలపై ఈ నెల 19వ తేదీ లోగా లిఖిత పూర్వక అభ్యంతరాలు తెలియజేయాలని ఈఆర్‌సీ కోరింది.
ఇప్పటికే 2022-23 ఇంధన సర్దుబాటు పేరిట రూ. 6,200 కోట్లకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అయితే, ఈ ప్రతిపాదనలపై వామపక్ష పార్టీలు, విద్యుత్ వినియోగదారుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ధరలు పెంచి ప్రజలపై మరింత భారం మోపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.
Also Read:
గౌతమ్ గంభీర్ పదవికి బీసీసీఐ ఎసరు
టెట్ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఇక్కడ చెక్ చేసుకోండి..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే..
For More Andhra Pradesh News and Telugu News..