Share News

Chandrababu Cabinet: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం?

ABN , Publish Date - Jun 14 , 2024 | 07:32 AM

ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..

Chandrababu Cabinet: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం?
Nara Chandrababu Cabinet

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న జరగనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) ఆధ్వర్యంలో తొలిసారి ఈ సమావేశం జరగనుంది.! ఆ మరుసటి రోజే 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏపీ లాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, ఇతర నిర్ణయాలను కేబినెట్‌లో పెట్టి ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కేబినెట్, అసెంబ్లీ సమావేశాలపై ఈ రోజు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.


Chandrababu-Sachivalayam.jpg

వచ్చీ రాగానే శరవేగంగా రాష్ట్ర పరిస్థితులను గాడిన పెట్టే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రులకు శాఖలు కేటాయించాల్సి ఉంది. నేడో రేపో శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం ప్రారంభం కానుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదం కోసం లాంఛనంగా శాసనసభ సమావేశం నిర్వహించనున్నారు.

CBN-Meeting-With-Ministers.jpg

Updated Date - Jun 14 , 2024 | 08:19 AM