Share News

Tirumala: తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదు.. మంత్రి ఆనంకు భక్తుడి ఫిర్యాదు

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:49 PM

Andhrapradesh: తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు.

Tirumala: తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదు.. మంత్రి ఆనంకు భక్తుడి ఫిర్యాదు
Tirumala

తిరుమల, సెప్టెంబర్ 16: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడిని (Lord venkateshwara) పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. ఆ శ్రీనివాసుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు వేచి ఉంటారు. ఇక వారాంతాలు, పండగల సమయాల్లో అయితే స్వామి దర్శనానికి గంటల సమయం పడుతుంది. క్యూలైన్లలో ఉండే భక్తుల అవసరాలను టీటీడీ తీరుస్తుంది. భోజనసదుపాయాలను అందిస్తుంది. తాజాగా తిరుమలలో ఏర్పాట్లపై ఓ భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా ఏపీ మంత్రికే తిరుమలలో ఏర్పాట్లపై ఫిర్యాదు చేశాడు.

UPI Rules Change: నేటి నుంచి యూపీఐ రూల్స్ ఛేంజ్.. రూ. 5 లక్షల లావాదేవీలు చేయవచ్చా..


తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి (Minister Anam Ram Narayanareddy) భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి ఆనం.. భక్తుడ్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులకు చెప్పి దర్శనం కల్పిస్తామని భక్తుడికి మంత్రి ఆనం హామీ ఇచ్చారు.

anam-ram.jpg

TG News: హుషారుగా లడ్డూ వేలం పాట పాడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ ఆ తరువాత


కాగా.. ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వరుడిని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనాంనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి వైఫరిత్యం వల్ల రాష్ట్రంలోని ఓ ప్రాంతం అతలాకుతలమైందన్నారు. 10 రోజుల పాటు ఆహారం దొరక్క, నిలువున నీడలేక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. కష్ట కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతోనే ఉండి వారి కష్టాలను తీర్చారన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రస్తుతం అక్కడ పూర్వ పరిస్థితులను నెలకొల్పారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Dokka Manikya varaprasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా

Ramakrishna: వాటిపై చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి..

Read LatestAP NewsANDTelugu News

Updated Date - Sep 16 , 2024 | 02:16 PM