Share News

AP Politics: టీడీపీలోకి కుప్పం వైసీపీ నేతలు...

ABN , Publish Date - Jul 31 , 2024 | 01:37 PM

Andhrapradesh: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. మరికొందరు పార్టీ నుంచి జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటు కుప్పంలోనే వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు.. టీడీపీ కండువా కప్పుకున్నారు.

AP Politics: టీడీపీలోకి కుప్పం వైసీపీ నేతలు...
Kuppam YCP leaders joined TDP

అమరావతి, జూలై 31: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు.. టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. మరికొందరు పార్టీ నుంచి జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటు కుప్పంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు (YSRCP Leaders).. టీడీపీ పార్టీ (TDP) కండువా కప్పుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబ నాయుడు (CM Chandrababu Naidu) సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు.

KTR Vs Revanth: కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం!



ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. కుప్పం అభివృద్ధి చెందాలంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

CM Chandrababu: ఏపీలో నూతన మద్యం విధానం అమలు..


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ... త్వరలోనే కుప్పం నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారని స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా కుప్పంలో ఎలాంటి అరాచకాలు చోటుచేసుకున్నాయో అందరికీ తెలుసిందే అన్నారు.కుప్పంలో వైసీపీ అవినీతి అరాచకాలపై విచారణ జరుగుతుందన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించారన్నారు. హంద్రీనీవా కాలు ద్వారా వచ్చే నీటిని నిలువ చేయడానికి రూ.500 కోట్లతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో 2000 ఎకరాలతో సెజ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఎవరైతే తటస్తులుగా ఉండి కుప్పం అభివృద్ధిని కోరుకుంటున్నారో వారందరినీ టీడీపీలోకి ఆహ్వానిస్తామని ఎమ్మెల్సీ శ్రీకాంత్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chennai: రేషన్‌ దుకాణాల్లో మద్యం, కల్లు.. హైకోర్టులో పిటిషన్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 31 , 2024 | 01:39 PM