TTD: వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన రమణ దీక్షితులు
ABN , Publish Date - Feb 22 , 2024 | 02:42 PM
Andhrapradesh: టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. అయితే ఆ వీడియోపై తాజాగా రమణ దీక్షితులు స్పందించారు. టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు.
తిరుమల, ఫిబ్రవరి 22: టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (TTD head priest Ramana Dikshitulu) మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై (EO Dharmareddy) రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. అయితే ఆ వీడియోపై తాజాగా రమణ దీక్షితులు స్పందించారు. టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తాను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను కలవలేదని తెలిపారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా.. ఈవోకీ వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. టీటీడీతో ఉన్న సంబంధాలతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆ వీడియో ఉందన్నారు. ఈ అంశంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని రమణ దీక్షితులు వెల్లడించారు.
వీడియోలో ఏముందంటే...
కాగా.. తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయి అంటూ రమణ దీక్షితులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్ మోహన్‌రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్దసమస్య అని అన్నారు. ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయలేదని.. ఖననం చేశారని అన్నారు అంటూ టీటీడీపై, ఈవోపై రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే వీడియోలోని అంశాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా ఉన్నాయంటూ బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాకు (Central Home Minister Amit Shah) రామచంద్ర యాదవ్ లేఖ రాసిన విషయం తెలిసిందే.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...