Share News

Dwarampudi Chandrasekhar: అధికారులపై రాళ్లతో దాడి..!!

ABN , Publish Date - Jul 02 , 2024 | 08:05 PM

కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు. గతంలో వైసీపీ హయాంలో అడిగేవారు లేకపోవడంతో అక్రమ కట్టడం గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.

Dwarampudi Chandrasekhar: అధికారులపై రాళ్లతో దాడి..!!
Dwarampudi Chandrasekhar

కాకినాడ: కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ (Dwarampudi Chandrasekhar) రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి, వైసీపీ అధికారానికి దూరమైనా అతనిలో ఏ మార్పు లేదు. కాకినాడ టౌన్ మెయిన్ సెంటర్ వద్ద అక్రమంగా నాలుగు అంతస్తలు భవనాన్ని నిర్మించారు. గతంలో వైసీపీ హయాంలో అడిగేవారు లేకపోవడంతో అక్రమ కట్టడం గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం మారింది.. అక్రమ కట్టడాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్న సరే నేలమట్టం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో అధికారులు కాకినాడలో గల ద్వారంపూడి అక్రమ కట్టడం వద్దకు రాగా ద్వారంపూడి రెచ్చిపోయారు.


నోటీసులు

కాకినాడలో అక్రమ కట్టడం గురించి అధికారులు ముందు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రిప్లై ఇవ్వలేదు. మంగళవారం కూల్చేందుకు కార్పొరేషన్ అధికారులు వచ్చారు. అధికారులు అలా వచ్చారో లేదో.. కూల్చేందుకు వీలు లేదని భీష్మించుకొని కూర్చొన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్. నిబంధనల మేరకు ఆ భవనం లేదని, కూలుస్తామని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ద్వారంపూడి బరితెగించారు. తనపై వెళ్లి కూల్చాలని అడ్డుకున్నారు. ఆయన ఒక్కసారిగా అలా ప్రవర్తించడంతో ఏం చేయాలో అధికారులకు తోచలేదు. తమను డ్యూటీ చేయనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రెచ్చిపోయిన అనుచరులు

ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలా ప్రవర్తిస్తే.. ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. భవనం వద్దకు వచ్చిన అధికారులపై రాళ్లు రువ్వారు. ఇటుకలు విసిరి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. రాళ్లు, ఇటుకలు విసరడంతో ఇద్దరు గాయపడ్డారు.

Also Read: AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?

Also Read: West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 08:05 PM