Share News

YSRCP: రాజోలు వైసీపీలో అసంతృప్తి సెగలు... టికెట్‌పై రాపాక సంచలన కామెంట్స్

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:11 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగే టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు వైసీపీకి వచ్చారు. ఆయన రాకతో రాజోలు నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రాపాక అనుచరులు వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.

YSRCP: రాజోలు వైసీపీలో అసంతృప్తి సెగలు... టికెట్‌పై రాపాక సంచలన కామెంట్స్

అంబేద్కర్ కోనసీమ జిల్లా, మార్చి 12: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) సమీపిస్తున్న వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగే టీడీపీ (TDP) నుంచి గొల్లపల్లి సూర్యారావు (Gollapalli Suryarao) వైసీపీకి (YSRCP) వచ్చారు. ఆయన రాకతో రాజోలు నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (MLA Rapaka Varaprasad Rao) అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రాపాక అనుచరులు వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.

Kishan Reddy: తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం


మరోవైపు.. రాజోలు నియోజకవర్గం టికెట్‌పై ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో వైసీపీ వరుసగా రెండు సార్లు ఓడిపోయిందని.. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మూడోసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నారు. రాజోలు సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలని సూచించారు. మళ్ళీ సర్వే నిర్వహించి గెలిచే వారికి టిక్కెట్ కేటాయించాలన్నారు. జగన్ ఆదేశిస్తే రాజోలు నుంచి గాని అమలాపురం లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. టికెట్ కోసం పోరాడే ఓపిక లేదని.. టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని రాపాక వరప్రసాదరావు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

AP Govt: డీఎస్సీ 2024 షెడ్యూల్‌‌లో మార్పులు.. దిగొచ్చిన ఏపీ సర్కార్

Amit Shah: తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఎంతో చెప్పేసిన షా.. త్వరలో రేవంత్‌కు జాబితా!


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 03:36 PM