AP Elections: మా ‘నవసందేహాలకు’ సమాధానం చెప్పండి: వైఎస్ షర్మిల
ABN , Publish Date - May 01 , 2024 | 12:18 PM
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో సొంత అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల, కడప ఎంపీ అభ్యర్థి వ్యాఖ్యలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిపై పాతాళానికి దిగజారి పోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాశారు.
కడప, మే 1: ఎన్నికల ప్రచారంలో (Election Campaign) సొంత అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) ఏపీసీసీ చీఫ్ , కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila Reddy) వ్యాఖ్యలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిపై పాతాళానికి దిగజారి పోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న "నవ సందేహాలకు" సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని షర్మిల ఆరోపించారు.
AP Elections: ప్రచారం ఒకరికి.. ఓటు మరొకరికి.. ఆ పార్టీ నేతల్లో గుబులు..
షర్మిల ప్రశ్నలు ఇవే..
1) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా?
2) సాగు భూమి నిచ్చే కార్య క్రమాన్ని ఎందుకు నిలిపివేశారు?
3) 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేశారు?
4) ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?
5) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?
6) దళిత, గిరిజన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?
7) ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా?
8) దళిత డ్రైవర్‌ను చంపి సూట్ కేసులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని మీరు ఎందుకు సమర్దిస్తున్నారు?
9) స్టడీ సర్కిల్స్‌కు నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?
ఇవి కూడా చదవండి...
BRS: బీఆర్ఎస్కు గుర్తుల గుబులు..! రోడ్ రోలర్, చపాతి మేకర్ ఎఫెక్ట్ భయం
Delhi: ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలుంటారా.. ప్రధాని మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్
Read Latest AP News And Telugu News