Share News

AP Elections: విజయవాడలో విస్తృతంగా సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం

ABN , Publish Date - May 10 , 2024 | 10:05 AM

Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో కూటమి‌ పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. కొండలు, గుట్టలు ఎక్కి ఇంటింటికీ‌ వెళ్లి ప్రజలను కలిశారు. సుజనా ముందు ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. మంచినీరు, డ్రైనేజి, రోడ్ల దుస్థితిని సుజనాకు స్థానికులు వివరించారు.

AP Elections: విజయవాడలో విస్తృతంగా సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం
BJP candidate Sujana Chowdary Election Campaign

విజయవాడ, మే 10: పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో (Election Campaign) కూటమి‌ పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి (BJP Candidate Sujana chowdary) పాల్గొన్నారు. కొండలు, గుట్టలు ఎక్కి ఇంటింటికీ‌ వెళ్లి ప్రజలను కలిశారు. సుజనా ముందు ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. మంచినీరు, డ్రైనేజి, రోడ్ల దుస్థితిని సుజనాకు స్థానికులు వివరించారు. ఎన్నికల కోడ్ (Election Code) ముగిసిన వెంటనే పనులు‌ చేపడతానని బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు.

Hyderabad: రేపు ఆఖరు.. సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం


ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గం లో అనేక సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. గత పాలకులు నిర్లక్ష్యానికి ఈ నియోజకవర్గం నిదర్శనమని విమర్శించారు. 22 డివిజన్‌లలో‌ కార్యాలయాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి ఆయా రంగాల్లో ఎదిగేలా ప్రోత్సాహం ఇస్తామన్నారు. కాళేశ్వరరావు మార్కెట్, పూల మార్కెట్‌ను పరిశీలించానని.. ఇక్కడ ఉన్న వ్యాపారులు, కార్మికులు అనేక సమస్యలు చెప్పారని తెలిపారు. అంటే ఎక్కడకి వెళ్లినా సమస్యలు స్వాగతం పలికే దుస్థితికి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని గత పాలకులు ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటమే తప్ప... పని చేయాలనే తపన వారికి లేదన్నారు.

AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!


పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళిక కూడా సిద్ధం చేశామన్నారు. వాళ్లు మాటలకే సిద్దమని.. తాము ప్రజలకు సౌకర్యాలు ఇచ్చేలా పని చేయడానికి సన్నద్దం అంటున్నామన్నారు. ఏపీలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపుతామన్నారు. కూరగాయలు, పూల వ్యాపారులకు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఠా కార్మికుల ఇబ్బందులు కూడా పరిష్కరిస్తామన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారు కలిసి వ్యాపారాలు చేసుకోవడం తన ఆనందం కలిగించిందన్నారు. గతంలో ప్రతి పనికి డబ్బులు తీసుకునే వారని చెప్పారని.. అటువంటివి లేకుండా పని జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి.. ఆ శాఖ అధికారులతో కూడా మాట్లాడతామన్నారు. సంపద సృష్టించే విధంగా ఈ కూరగాయలు, పూల మార్కెట్‌లను మరింత అభివృద్ధి చేస్తామని సుజనా చౌదరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’

AP Election 2024: కసితీరా ఓటేశారు!..

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 10:08 AM