Share News

Chandrababu: నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో జగన్ పీహెచ్డీ చేశారు

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:55 PM

నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. మనల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కర్రలు చేతపట్టి రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చారు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో మళ్లీ అరాచకం సృష్టిస్తుందని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

Chandrababu: నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో జగన్ పీహెచ్డీ చేశారు
Nara Chandrababu Naidu

నెల్లూరు: నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. మనల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కర్రలు చేతపట్టి రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చారు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో మళ్లీ అరాచకం సృష్టిస్తుందని చంద్రబాబు విరుచుకుపడ్డారు.


AP Elections: కొత్త స్కీం లేదు.. మెరుపులు లేవు.. తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

నెల్లూరుపాళెం కూడలిలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. నెల్లూరుపాళెం కూడలి జనసంద్రంగా మారింది.కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆత్మకూరు పసుపుమయంగా మారింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో సైకో జగన్, విజయసాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల‌ రామకృష్ణారెడ్డి తప్పించి ఎవరూ బాగుపడలేదన్నారు.


AP Elections 2024: రాజధానిపై జగన్ నిర్ణయం ఇదే.. అమరావతిపై మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే!

రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు..

ఒక నాయకుడికి పరిపాలన దక్షత ఉండాలన్నారు. సంపద సృష్టించాలి.. కానీ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయకూడదని హితవు పలికారు. తెలుగు జాతికి, తెలుగువారికి, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి.. ఈ సైకో జగన్ అని విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలి, గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలన్నారు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని చెప్పారు. అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుందన్నారు. సంపద పెరిగితే ఆదాయాలు పెరుగుతాయని.. ఆర్థిక వ్యవస్థలో ఇదో రహస్యమని వివరించారు. జగన్ అస్సలు చదువుకున్నారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో మన భూములు, ఆస్తులకి రక్షణ లేదన్నారు. బ్రిటీషు కాలం నుంచి వచ్చిన చట్టాలని, రికార్డులని మార్చేశారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆయనకి గనుల మీదే దృష్టి..

‘‘ఈ ఎన్నికల్లో మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సీనియర్ నేత, అనుభవం ఉన్న వ్యక్తి,.. జిల్లాను అభివృద్ధి చేసిన వ్యక్తి ఆనం రామనారాయణరెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజకీయం, డబ్బులు అవసరం లేదు‌. తాను సంపాదించిన డబ్బు ప్రజల కోసం ఖర్చుపెట్టారు. పోటీకి ఎవరిని పెట్టారో చూశారా? ఆ వ్యక్తిని ఎప్పుడైనా చూశారా? ఏమైనా అభివృద్ధి చేశారా? సోమశిల డ్యాం, కండలేరు డ్యాంని నిర్మించి డెల్టాని సుస్థిరత చేసిన వ్యక్తి ఎన్టీఆర్, టీడీపీ. నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే, అది ఎన్టీఆర్ పుణ్యం. ఇక్కడో ఎమ్మెల్యే ఉన్నాడు... దోచుకోవడం తప్పించి అభివృద్ధిపై శ్రద్ధ లేదు. మరో మంత్రి ఉన్నాడు... ఆయనకు గనుల మీదే దృష్టి. కరోనా సమయంలో అందరూ ఇళ్లలో ఉంటే... రైతులు కష్టించి పంటలు పండించారు. ధాన్యం అమ్మకాల్లోనూ దోచుకున్నారు. రైతులకు ఏడాదికి రూ.25వేలు ఇస్తాం. వ్యవసాయంలో యాంత్రీకరణ తీసుకొస్తాం. పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. నదులను అనుసంధానం చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.


వైసీపీ మేనిఫెస్టోలో రైతుల పథకాలేవీ.. ?

‘‘ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తే, రైతులకు సంబంధించి ఒక్క పథకం లేదు. మద్యపాన నిషేధం చేస్తానని చేశారా?... మద్యం మీదా దోచుకుంటున్నారా? లేదా? మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానని అన్నాడు. సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నాడు. మహిళల తాళిబొట్లు తెంచేశాడు. గులకరాయి డ్రామా బయటపడింది. అందరూ బ్యాండ్లు పెట్టుకుంటున్నారు. గులకరాయితో హత్యాయత్నం చేశారంటారు. కోడికత్తిని గుచ్చారంటారు. బాబాయిని గొడ్డలితో నరికి చంపుతారు. ట్యాంకులో నీళ్లుంటే ట్యాపుల్లో నీళ్లొస్తాయి. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఒక్కొక్కరి నెత్తిన రూ.8లక్షల అప్పు పెట్టాడు. ఇసుక, గంజాయి, ఎర్రచందనం, మైనింగ్ కుంభకోణాలు... నాపైన ఎవరైనా కేసులు పెట్టారా? నేను తప్పులు చేశానా? అడ్డొచ్చిన వారిని నరికేస్తారా? ఇప్పుడేమో మేము శత్రువులంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు, వైసీపీకి ఓట్లు వేయని వారు శత్రువులా? మళ్లీ పాత రాష్ట్రం రావాలంటే... గంజాయి, డ్రగ్స్ పోవాలంటే ఈ ఎన్నికల్లో కూటమి గెలవాలి. మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తా. పది రోజులు మీరు పనిచేయండి... మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే బాధ్యత నేను తీసుకుంటా’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

AP Elections: సిగ్గు, సంస్కారం వదిలేశారు.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్..

AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 06:26 PM