AP Politics: భయంతో వ్యక్తిగత జీవితాల్లోకి జగన్ రెడ్డి చూస్తున్నారు: దేవినేని ఉమ విసుర్లు
ABN , Publish Date - Apr 12 , 2024 | 04:25 PM
ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైంది. దాంతో సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లను అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి: ఫోన్ ట్యాపింగ్ అంశం ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రకంపనలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఫోన్ ట్యాపింగ్‌కు గురైంది. దాంతో సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్లను అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
AP Election 2024: చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి భేటీ.. ఈ అంశాలపైనే చర్చ!
లోకేష్‌కు మెసేజ్
టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ ఐ ఫోన్ వాడుతుంటారు. ఆయన మొబైల్ ట్యాపింగ్ అయినట్టు అలర్ట్ మెసేజ్ వచ్చింది. ట్యాపింగ్ అంశాన్ని యాపిల్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో కనిపెట్టారు. తన మొబైల్ ట్యాపింగ్ అయ్యిందని లోకేశ్ స్పష్టం చేశారు. విపక్ష నేతలే కాదు ఎన్నికల అధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు మాజీమంత్రి దేవినేని ఉమ. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిపక్ష నేతల మొబైల్స్ ట్యాప్ చేస్తున్నారని వివరించారు.
AP HighCourt: ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్ట్ సీరియస్
సీఎం జగన్ ఆదేశాలతోనే..
సీఎం జగన్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని దేవినేని ఉమ అంటున్నారు. డీజీపీ నిర్దేశంలో ట్యాపింగ్ జరుగుతుందని.. అడిషనల్ డీజీ, డీఎస్పీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ట్యాపింగ్ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేత కనకమేడల రవీంద్ర ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
జగన్‌కు భయం
రాష్ట్రంలో చేసిన దోపిడీపై సీఎం జగన్‌కు భయం పట్టుకుందని దేవినేని ఉమ ఆరోపించారు. అందుకోసమే ప్రజల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, సీఎంవో అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం