Share News

Yarapatineni Srinivas: దాడుల నియంత్రణలో ఈసీ, డీజీపీ, సీఎస్ విఫలం

ABN , Publish Date - May 16 , 2024 | 12:51 PM

Andhrapradesh: పల్నాడులో జరుగుతున్న దాడులపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. దాడులను నియంత్రించటంలో ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ పూర్తిగా విఫలమయ్యారన్నారు.

Yarapatineni Srinivas: దాడుల నియంత్రణలో ఈసీ, డీజీపీ, సీఎస్ విఫలం
Former MLA Yarapatineni Srinivasrao

గుంటూరు, మే 16: పల్నాడులో (Palnadu Attacks) జరుగుతున్న దాడులపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు (Gurajala Former MLA Yarapatineni Srinivasa Rao) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు (YSRCP MLAs) అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. దాడులను నియంత్రించటంలో ఎన్నికల సంఘం (Election Commission), డీజీపీ (AP DGP), చీఫ్ సెక్రటరీ (AP CS) పూర్తిగా విఫలమయ్యారన్నారు. పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం ఇంకా వైసీపీ కనుసన్నల్లో పని చేస్తోందని ఆరోపించారు.

TDP Mahanadu: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!


మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో భారీగా బాంబులు బయటపడ్డాయన్నారు. నిన్న రాత్రి బాంబులు గుర్తించినా.. ఇప్పటి వరకూ పోలీసులు గోప్యంగా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు వైసీపీ నేతలను తప్పిస్తారని అనుమానంగా ఉందన్నారు. పల్నాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. వైసీపీకి కావాల్సింది అరాచకాలు, మనకు కావాల్సింది పల్నాడు అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే అరాచకవాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Gudivada Amarnath: ‘వన్ సైడ్ విక్టరీ మాదే...మళ్లీ జగనే సీఎం’

Chandrababu Naidu: మారిన చంద్రబాబును చూస్తారు

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 12:54 PM