Share News

AP Elections: వై నాట్ 175 సౌండ్ తగ్గింది.. వైసీపీలో భయం మొదలైంది: అయ్యన్న

ABN , Publish Date - May 07 , 2024 | 12:53 PM

Andhrapradesh: వై నాట్ 175 సౌండ్ తగ్గింది.. వైసీపీకి భయం మొదలైంది అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి సమాధి కట్టడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల సక్రమంగా జరగవని జగన్ అంటుంటే తమకు ఆశ్చర్యంగా ఉంది.. ఎన్నికల్లో గొడవలు పెట్టి జగన్ ఈ విధంగా మాట్లాడటం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు.

AP Elections: వై నాట్ 175 సౌండ్ తగ్గింది.. వైసీపీలో భయం మొదలైంది: అయ్యన్న
TDP Leader Ayyanna Patrudu

విశాఖపట్నం, మే 7: వై నాట్ 175 సౌండ్ తగ్గింది.. వైసీపీకి (YSRCP) భయం మొదలైంది అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (TDP Leader Ayyannapatrudu) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి సమాధి కట్టడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల సక్రమంగా జరగవని జగన్ (CM Jagan) అంటుంటే తమకు ఆశ్చర్యంగా ఉంది.. ఎన్నికల్లో గొడవలు పెట్టి జగన్ ఈ విధంగా మాట్లాడటం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శించారు.

AP Elections: ఓడిపోతానని జగన్‌కు అర్థమైపోయింది.. అందుకే: కనకమేడల


నర్సీపట్నంలో రిటర్నింగ్ అధికారి తీరు సరిగా లేదని ఫిర్యాదు చేశానని... ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘వైసీపీ నుంచి నాకు, నా కొడుకుకు ఆఫర్స్ ఇచ్చారు. డబ్బులు ఖర్చు చేసి గెలిపిస్తామని ఆహ్వానం ఇచ్చారు. నా రక్తంలో ఉన్నది పసుపు రంగు మాత్రమే... అందుకే నేను వైసీపీ ఆఫర్స్ తిరస్కరించాను’’ అని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరం అయిందన్నారు. ఈ చట్టం వలన ప్రజల ఆస్తులకు రక్షణ కరువవుతుందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌పై ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులు కావాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: ఎన్నికల ప్రచారానికి దూరంగా శింగనమల టీడీపీ అభ్యర్థి!

Fact Check: బరితెగింపు.. ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ ప్రచారం..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 12:55 PM