Share News

Viral Video: బతికున్న ఆక్టోపస్‌ను టేబుల్ మీద పెట్టుకుని తినడానికి ప్రయత్నం.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!

ABN , Publish Date - May 07 , 2024 | 12:38 PM

ఇటీవలి కాలంలో వెరైటీ ఫుడ్స్ తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బతికి ఉన్న జంతువులను తినే క్రూర మనస్తత్వం కలిగిన మనుషులు ఇటీవల ఎక్కువయ్యారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు రెస్టారెంట్లు వెరైటీ డిషెస్‌ను ఆఫర్ చేస్తున్నాయి.

Viral Video: బతికున్న ఆక్టోపస్‌ను టేబుల్ మీద పెట్టుకుని తినడానికి ప్రయత్నం.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!
Live Octopus

ఇటీవలి కాలంలో వెరైటీ ఫుడ్స్ తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బతికి ఉన్న జంతువులను తినే క్రూర మనస్తత్వం కలిగిన మనుషులు ఇటీవల ఎక్కువయ్యారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు రెస్టారెంట్లు వెరైటీ డిషెస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. ఆ వీడియోలో బతికి ఉన్న ఆక్టోపస్‌ను (Live Octopus) తినేందుకు వడ్డించారు. bestfishing2024 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక రెస్టారెంట్‌ (Restaurent)లో డైనింగ్ టేబుల్‌పై వివిధ రకాల ఆహార పదార్థాలను ఉంచారు. అందులో బతికి ఉన్న ఆక్టోపస్ కూడా ఉంది. అయితే ఆక్టోపస్ అకస్మాత్తుగా వడ్డించే పాత్ర నుంచి బయటకు వచ్చి పారిపోవడానికి ప్రారంభించింది. టేబుల్‌పై ఆ ఆక్టోపస్ ఎలా ముందుకు కదులుతుందో ఆ వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యం చూడడానికి షాకింగ్‌గా ఉంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో సరైన సమాచారం లేదు.


చైనా, జపాన్ , కొరియా చాలా దేశాలలో ప్రజలు ఆక్టోపస్ మాంసాన్ని కూడా తింటారు. కొందరు బతికి ఉన్న ఆక్టోపస్‌ను కూడా తింటారు. ఈ వైరల్ వీడియోకు 3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 4.68 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మనిషి జీవించి ఉన్న జంతువులను కూడా తినేంత క్రూరంగా మారుతున్నాడు``, `` మనుషులు ఈ భూమ్మీద జీవించడానికి అనర్హులు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పామును పళ్లెంలో పెట్టి రుద్రాభిషేకం.. బుసలు కొడుతున్న పాము చుట్టూ కూర్చుని పూజలు.. వీడియో వైరల్!


Puzzle: ఈ పజిల్ మీ సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు ముఖ్యమైన తేడాలను కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2024 | 12:38 PM