AP Elections: ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి కేశినేని చిన్ని.. కానీ
ABN , Publish Date - May 13 , 2024 | 08:12 AM
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులతో పోలింగ్ ఆలస్యమైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ పోలింగ్ ప్రారంభంకాని పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ ఆలస్యం కారణంగా రాజకీయ నేతలు కూడా పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇటు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఉదయం ఏడు గంటలకే ఓటు వేసేందుకు వచ్చారు.
విజయవాడ, మే 13: ఏపీలో పోలింగ్ (AP Elections 2024) ప్రారంభమైంది. అయితే పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులతో పోలింగ్ ఆలస్యమైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ పోలింగ్ ప్రారంభంకాని పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ ఆలస్యం కారణంగా రాజకీయ నేతలు కూడా పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇటు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని (TDP Candidate Kesineni Chinni) ఉదయం ఏడు గంటలకే ఓటు వేసేందుకు వచ్చారు.
AP Elections 2024: పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ అరాచకాలు.. ఒక్కోచోట ఒక్కోలా..
లయోలా కాలేజీలోని మోడల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన కేశినేని చిన్ని, కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. అయితే బూతు నెంబర్ 56లో ఈవీఎం మిషన్ పని చేయకపోవడం కారణంగా ఇప్పటి వరకు అక్కడ పోలింగ్ ప్రారంభంకాలేదు. ఈవీఎం మిషన్ పనిచేయని కారణంగా కేశినేని చిన్ని పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్నారు. ఈవీఎం మిషన్ పనిచేయకపోవడం కారణంగా బూతు నెంబర్ 56లో టీడీపీ పట్టాభి కుటుంబసభ్యులు కూడా వేచి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Lok Sabha Polls 2024: ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్, బన్నీ..
AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన
Read Latest AP News And Telugu News