AP Elections: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తరపున భార్య ముమ్మర ప్రచారం
ABN , Publish Date - Apr 19 , 2024 | 11:28 AM
Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. న్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున వారి కుటుంబసభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు, అన్న కోసం తమ్ముడు ఇలా అభ్యర్థుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ...
ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 19: ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) సమీపిస్తున్న తరుణంలో ప్రచారాలు (Election Campaign) ఊపందుకున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి ఓటు తమకే వేయాలని, మరింత అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఆయా పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలను వివరిస్తూ ఇంటింటికీ తిరుగుతూ, ఓటర్లను కలుస్తూ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. తప్పకుండా తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండటంతో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున వారి కుటుంబసభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు, అన్న కోసం తమ్ముడు ఇలా అభ్యర్థుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. తమవారికి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
YS Jagan: సొంత జిల్లాలోనే సీఎం జగన్‌కు బొమ్మ పడుతోంది!!
కోడూరులో ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి ప్రచారం..
ఇటు ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (TDP MLA Candidate Vasantha Krishna Prasad) భార్య శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని జి.కొండూరులో ఎమ్మెల్యే సతీమణి ఎన్నికల ప్రచారం చేశారు. తన భర్తను గెలిపించాలని కోరుతూ శిరీష ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలు ఎమ్మెల్యే భార్య వివరిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలను మహిళలు, పేదలకు వివరిస్తూ ప్రచారంలో కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష దూసుకుపోతున్నారు. శిరీషతో ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి...
AP Politics: మంత్రి జోగికి స్వయానా బామ్మర్థులే ఎలాంటి షాకిచ్చారో చూడండి..
Chandrababu: విజయనగరం జిల్లాకు చంద్రబాబు.. పవన్
మరిన్ని ఏపీ వార్తల కోసం...