AP Elections: కోలాహలంగా కేశినేని చిన్ని ర్యాలీ.. కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...
ABN , Publish Date - Apr 19 , 2024 | 03:46 PM
Andhrapradesh: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు మరికొంతమంది నామినేషన్ వేశారు. విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో కేశినేని చిన్ని ర్యాలీ కోలాహలంగా సాగింది. ర్యాలీ కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే...
విజయవాడ, ఏప్రిల్ 19: ఏపీలో నామినేషన్ల (Nominations) పర్వం కొనసాగుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు మరికొంతమంది నామినేషన్ వేశారు. విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని (Vijayawada Parliamentary Alliance Candidate Kesineni Chinni) మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసందోహంతో కేశినేని చిన్ని ర్యాలీ కోలాహలంగా సాగింది. ర్యాలీ కేశినేని నాని కార్యాలయం వద్దకు రాగానే టీడీపీ కండువా తిప్పుతూ కేశినేని చిన్ని క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి చిన్ని నామినేషన్ పత్రాలను అందజేశారు.
Acquisition: ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థను కొనుగోలు చేసిన ఐటి సంస్థ
ర్యాలీ చూస్తేనే వైసీపీకి దిమ్మతిరుగుతోంది..
ఆపై కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ.. దుర్గమ్మ ఆశీస్సులతో పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తప్పకుండా ఎంపీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ ర్యాలీ చూస్తే అధికారపక్షానికి దిమ్మతిరుగుతోందన్నారు. అధికార పక్షానికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి తానే చేశాను అంటూ చెప్పుకుంటున్నారని... అభివృద్ధి జరిగిందంటే అది టీడీపీ హయాంలోనే అని వెల్లడించారు. విజయవాడ పార్లమెంట్ సమగ్రాభివృద్ధికి త్వరలోనే ఒక ఎజెండాను తయారు చేస్తామని చెప్పారు.
Balakrishna: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు
కోడి కత్తి డ్రామా అయిపోయింది.. ఇక
అన్ని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల అభిప్రాయాలతో పాటు పార్టీ అధినేతలతో చర్చించి మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, త్రాగు సాగునీటి సమస్యలు పరిష్కరించడమే తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఎజెండా అని చెప్పుకొచ్చారు. తన విజయాన్ని విజయవాడ పార్లమెంటు ప్రజలు ఎప్పుడో నిర్ణయించారన్నారు. కేశినేని నాని కార్యాలయం రాగానే టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం, కసి కనిపించాయని.. కూటమి కార్యకర్తల కసి ఏంటో రానున్న ఎన్నికల్లో అధికారపార్టీకి తెలుస్తుందన్నారు. కూటమి కార్యకర్తలు, నేతల ర్యాలీతో విజయవాడ దద్దరిల్లిందన్నారు. గులకరాళ్ల డ్రామాలు ప్రజలు నమ్మరని తెలిపారు. ఇద్దరు చెల్లెళ్ళు జగన్ అరాచకాలు చూసి రోడ్డెక్కి లబోదిబోమంటున్నారన్నారు. కోడి కత్తి డ్రామా అయిపోయిందని.. తాజాగా గులకరాయి డ్రామా మొదలుపెట్టారని... అది ఎవరో నమ్మే స్థితిలో లేరని కేశినేని చిన్ని వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
YS Vijayamma: అమ్మకు బర్త్ డే విషెష్ చెప్పిన షర్మిలమ్మ
LokSabha Elections: గాంధీనగర్‌లో నామినేషన్ వేసిన అమిత్ షా
మరిన్ని ఏపీ వార్తల కోసం....