Share News

AP Politics: మీకు అండగా నేనుంటా.. వైసీపీకి దిమ్మతిరిగే తీర్పివ్వండి: చంద్రబాబు

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:58 PM

తనకు ఆడ బిడ్డలు లేరని.. వారిని తన అక్కచెల్లెమ్మలుగా, తన బిడ్డలుగా భావిస్తున్నానని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. తాను మహిళా పక్షపాతిని అని చెప్పారు. మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెడితే అవహేళన చేశారని పేర్కొన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో(Srikakulam) మహిళా సదస్సులో..

AP Politics: మీకు అండగా నేనుంటా.. వైసీపీకి దిమ్మతిరిగే తీర్పివ్వండి: చంద్రబాబు
Chandrababu

శ్రీకాకుళం, ఏప్రిల్ 24: తనకు ఆడ బిడ్డలు లేరని.. వారిని తన అక్కచెల్లెమ్మలుగా, తన బిడ్డలుగా భావిస్తున్నానని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. తాను మహిళా పక్షపాతిని అని చెప్పారు. మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెడితే అవహేళన చేశారని పేర్కొన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో(Srikakulam) మహిళా సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. మహిళల కోసం తాను ఎంతో చేశానని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచించానని చెప్పారు.


జగన్ పాలనలో 5 ఏళ్లలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్ ఒక సైకో అంటూ ఘాటైన వ్యా్ఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలను తలకిందులు చేసిందన్నారు. ఖర్చులు పెరిగాయని.. దానికి తగ్గ ఆదాయం లేదన్నారు. మే 13న వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. మహిళల దెబ్బకు వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవాలన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఆరోపించారు. జగన్ అమ్ముతున్న మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడువుతోందన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్.. క్రమంగా మద్యం అమ్మకాలు పెంచుతూ వచ్చాడని చంద్రబాబు విమర్శించారు.

ఇదికూడా చదవండి: దళిత యువకుల మృతికి కారణమైన హోంమంత్రిని ప్రజలు తిప్పికొట్టాలి


మహిళలే ఎక్కువ నష్టపోయారు..

మహిళా సదస్సులో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మహిళల ఆశీర్వాదంతో చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టబోతున్నారని అన్నారు. జగన్ పాలనలో మహిళలే ఎక్కువగా నష్టపోయారని.. ఎన్నికల ముందు మీ అన్నను, మీ బిడ్డను అని చెప్పి మోసం చేశాడంటూ జగన్‌ తీరును తూర్పారబట్టారు. పేదల కోసం పని చేసే పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు రామ్మోహన్. మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. మహిళా సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం అని చెప్పారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక అభివృద్ధికి పాటుపడింది చంద్రబాబేనని పేర్కొన్నారు. జగన్ వచ్చాక రాష్ట్రంలో రాక్షసులను తయారు చేసాడని దుయ్యబట్టారు. దేశంలో మహిళలపై ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నది ఏపీ లోనే అని.. దీనంతటికీ కారణం జగన్ పాలనేనని విమర్శించారాయన. చిన్న తప్పు కారణంగా 5 ఏళ్లు నరకం చూశామని.. మరోసారి అలాంటి తప్పు చేయొద్దని ప్రజలను కోరారు రామ్మోహన్ నాయుడు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2024 | 02:27 PM