Share News

AP Rains: వరద బాధితులకు అండగా వెంకయ్య నాయుడు.. విరాళం..

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:38 PM

తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు. తన కుమారుడు, కుమార్తె తరఫున కూడా విరాళం ప్రకటించారాయన.

AP Rains: వరద బాధితులకు అండగా వెంకయ్య నాయుడు.. విరాళం..
Venkaiah Naidu

అమరావతి, సెప్టెంబర్ 02: తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు. తన కుమారుడు, కుమార్తె తరఫున కూడా విరాళం ప్రకటించారాయన. వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 5 లక్షలు చొప్పున సహాయం ప్రకటించగా.. తన కుమారుడు, తరఫున రూ.2.5 చొప్పున రెండు రాష్ట్రాలకు సహాయం ప్రకటించారు.


ఇదే విషయమైన మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. కుండ పోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్‌లో ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారన్నారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారన్నారు.


ఇక తన వంతు సహకారంగా తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు సహాయ చర్యల నిమిత్తం పంపించానని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. యువత కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.


అలాగే వెంకయ్య నాయుడు కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేశారు. ఆయన కూతురు దీపా వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేశారు.


Also Read:

రాగల 24 గంటల్లో వాతావరణంపై విశాఖ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన

'అపరాజిత' పేరుతో మమత సర్కార్ బిల్లు

రూ.9 లక్షలకే కొత్త మోడల్ కార్.. ఫీచర్లు ఎలా

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 02 , 2024 | 05:54 PM