Share News

Pinnelli Ramakrishna: పిన్నెల్లి కోసం పోలీసుల ఛేజింగ్.. సినిమాను మించిన ట్విస్ట్‌లు..

ABN , Publish Date - May 22 , 2024 | 02:14 PM

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) ఎపిసోడ్‌లో సినిమాను మించిన ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. పిన్నెల్లి కోసం చేజింగ్ నడుస్తోంది. ఈవీఎం ధ్వంసం(EVM Damage Case) కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు(AP Police) ప్రయత్నిస్తుండగా.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

Pinnelli Ramakrishna:  పిన్నెల్లి కోసం పోలీసుల ఛేజింగ్.. సినిమాను మించిన ట్విస్ట్‌లు..
Pinnelli Ramakrishna Reddy

పల్నాడు, మే 22: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) ఎపిసోడ్‌లో సినిమాను మించిన ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. పిన్నెల్లి కోసం చేజింగ్ నడుస్తోంది. ఈవీఎం ధ్వంసం(EVM Damage Case) కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు(AP Police) ప్రయత్నిస్తుండగా.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణ సరిహద్దులు(Telangana Borders) దాటి బీదర్ వైపు వెళ్తున్నట్లు పోలీస్ బృందాలకు సమాచారం అందింది. అంతకు ముందు సంగారెడ్డి పట్టణానికి సమీపంలోని కంది వద్ద తన కారు, డ్రైవర్, మొబైల్‌ను వదిలేసి పిన్నెల్లి వేరే వాహనంలో వెళ్లిపోయినట్లు ఏపీ పోలీస్ బృందాలు గుర్తించాయి. అక్కడి నుంచి మహారాష్ట్రలోని బీదర్ వైపు వెళ్తున్నారని ట్రాక్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో అలర్ట్ అయిన ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు.. బీదర్ వైపునకు ఏపీ, తెలంగాణ టీమ్స్ వెళ్లాలని కోరారు. దీంతో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు బృందాలుగా ఏర్పడి.. పిన్నెల్లిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Read Also: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి లుకౌట్ నోటీసులు


పాల్వయి గేట్ గ్రామంలో పోలింగ్ బూత్‌లో ఈవీఎం ద్వంసం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆయన్ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి తన కారులో పరార్ అయ్యారు. తొలుత సంగారెడ్డి సమీపంలో తన కారు దిగి మొబైల్ ఫోన్‌ను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు రామకృష్ణారెడ్డి.

Read Also: ఫోన్లు వదిలి పారిపోయిన పిన్నెల్లి.. పోలీసుల అదుపులో డ్రైవర్!


మొత్తంగా ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరింత రసవత్తరంగా మారింది. పిన్నెల్లో పట్టుకునేందుకు పోలీసులు.. ఆ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి.. సినిమాను మించిన ఛేజింగ్ నడుస్తోంది. ఒకవేళ పిన్నెల్లి దొరికితే.. ఆయనపై తీవ్రమైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై రెండు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ భయంతో పిన్నెల్లి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పిన్నెల్లిపై అదనపు సెక్షన్లు కూడా పెట్టేందుకు కోర్టులో మెమో వేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వ్యవహారం చివరకు ఎంత వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 22 , 2024 | 02:49 PM